టెర్రర్ శ్రీకాంత్ కు బూస్ట్ ఇచ్చినట్లేనా?
ఒకప్పుడు ఫ్యామిలీ కథలకు మినిమమ్ గ్యారంటీ హీరో అంటే శ్రీకాంత్. క్రమేపి తన చిత్రాలకు శాటిలైట్ హక్కుల రూపంలో కూడా ఆదాయం రాని పరిస్థితి ఏర్పడింది. క్యారెక్టర్స్ చేస్తూ… అప్పుడప్పుడు తనతో చిత్రాలు చేయడానికి వచ్చిన దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ విషయంలో పేచి లేకుండా చేసి పెడుతునే వున్నాడు. తాజాగా టెర్రర్ చిత్రం ఆ కోవలోకి చెందిన చిత్రమే. శ్రీకాంత్ పోలీసాఫీసర్ గా గతంలో ఖడ్గం చిత్రం ఒక ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత […]
ఒకప్పుడు ఫ్యామిలీ కథలకు మినిమమ్ గ్యారంటీ హీరో అంటే శ్రీకాంత్. క్రమేపి తన చిత్రాలకు శాటిలైట్ హక్కుల రూపంలో కూడా ఆదాయం రాని పరిస్థితి ఏర్పడింది. క్యారెక్టర్స్ చేస్తూ… అప్పుడప్పుడు తనతో చిత్రాలు చేయడానికి వచ్చిన దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ విషయంలో పేచి లేకుండా చేసి పెడుతునే వున్నాడు. తాజాగా టెర్రర్ చిత్రం ఆ కోవలోకి చెందిన చిత్రమే. శ్రీకాంత్ పోలీసాఫీసర్ గా గతంలో ఖడ్గం చిత్రం ఒక ఎగ్జాంపుల్.
అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత హీరోల్ని యాక్షన్ చిత్రాల్లో చూడటానికి కుర్రకారు ఇష్ట పడటంలేదు. ముఖ్యంగా ప్రస్తుతం శ్రీకాంత్ చిత్రాలకు ఏ కేటగిరి ఆడియన్స్ వస్తారు అనేది పెద్ద ప్రశ్న. అయితేనేమి ప్రొడ్యూసర్ షేక్ మస్తాన్ అవేమి లెక్కలు వేయకుండా టెర్రర్ చిత్రం నిర్మించాడు. సతీష్ అనే కొత్త దర్శకుడు చేసిన ఈ చిత్రం మొదటి భాగం నుంచి గ్రిప్పింగ్ గా ఉన్నట్లు టాక్ వచ్చింది. అదే గ్రిప్పింగ్ ను సాగదీయకుండా సెకండాఫ్ లోకూడా కంటిన్యూ చేసి వుంటే.. టెర్రర్ నిజంగా శ్రీకాంత్ కు భారీ హిట్ ను తెచ్చి పెట్టేది అంటున్నారు పరిశీలకులు. మొత్తం మీద ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ చేసిన చిత్రాల్లో కంటే చాలా బెటర్ గా టెర్రర్ ఉందనేది అందరిమాట.