Telugu Global
NEWS

పయ్యావులా టైమ్ చెప్పు… 131 ఏళ్ల పార్టీనే చూశాం మీరెంత...

వైసీపీ  ఎమ్మెల్యే రోజా మరోసారి టీడీపీపై విరుచుకుపడ్డారు.  దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలన్న టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ సవాల్‌కు ఆమె స్పందించారు.  తమ 62 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారామె. అదే సమయంలో దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. రాజీనామా ఎప్పుడు చేద్దామన్న దానిపై టీడీపీ నేతలు టైమ్ చెప్పాలని సవాల్ చేశారు రోజా.   అసెంబ్లీ రద్దుకు డేట్ ఫిక్స్ చేయాలని, […]

పయ్యావులా టైమ్ చెప్పు… 131 ఏళ్ల పార్టీనే చూశాం మీరెంత...
X

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి టీడీపీపై విరుచుకుపడ్డారు. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలన్న టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ సవాల్‌కు ఆమె స్పందించారు. తమ 62 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారామె. అదే సమయంలో దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. రాజీనామా ఎప్పుడు చేద్దామన్న దానిపై టీడీపీ నేతలు టైమ్ చెప్పాలని సవాల్ చేశారు రోజా. అసెంబ్లీ రద్దుకు డేట్ ఫిక్స్ చేయాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని కేశవ్‌కు … జగన్ ను విమర్శించే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు.

131 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీయే జగన్‌ ని ఏమీ చేయలేకపోయింది. 33 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ ఏం చేస్తుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్, మోదీ కాళ్లు పట్టుకుని గెలిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. క్యారెక్టర్ లేని వారి జాబితాలో నెంబర్‌ వన్ ర్యాంకు చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు 35 ఏళ్ల రాజకీయ జీవితమే తప్పుడు మార్గంలో ప్రారంభమైందన్నారు. చంద్రబాబు క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయన్నారు.

ఎమ్మెల్యేలను కొని ప్రపంచంలోనే తెలుగువారి పరువును బజారున పడేసిన క్యారెక్టర్ చంద్రబాబుదని రోజా విమర్శించారు. రుణమాఫీ చేస్తానని రైతులని, డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. సోనియా, చంద్రబాబు కుమ్మకై 16 నెలలు జైల్లో పెట్టినా జగన్ భయపడలేదన్నారు.

Click on image to read:

cbn-doctorate

veni-krishna

balakrishna-speech

vote-for-note-1

ambati

ysrcp

RGV Chiranjeevi Pawan kalyan

Ramgopal Varma

sakshi

jagan-harikrishna

buma-tdp

revanth-yerrabelli

babu-balakrishna

bhuma1

ysrcp

MP-Shiva-Prasad

prabhas

chandrababu-naidu-chaild-1

railway-jurny

jagan-chandrababu-naidu

jagan111

mudragada-chandrababu

bhuma-shilpa-family-tdp

bhuma-nagireddy

chandrababu-it1

First Published:  26 Feb 2016 1:21 PM IST
Next Story