రైలు ప్రయాణాలకు ఇక మిగిలింది కుల రిజర్వేషన్లే?
2016 రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త రైళ్ల ప్రతిపాదనలు ఏమీ లేకపోగా ఉన్న రైళ్లలో ఉన్న రిజర్వేషన్లకు తోడు మహిళలకు, సీనియర్ సిటిజన్‌లకు రిజర్వేషన్ శాతం పెంచారు. ఈ నిర్ణయం మంచిదే. అయితే సాధారణ ప్రయాణికుల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే ఉన్న రిజర్వుడు సీట్లలో తత్కాల్ కోటా, ప్రీమియమ్ తత్కాల్ కోటా, ఈక్యూ కోటా, ఫిజికల్ హ్యాండీ క్యాప్‌డ్ కోటా, లేడీస్ కోటా, డిఫెన్స్ కోటా, ఫారిన్ టూరిస్టుల కోటా, యువ కోటా, డ్యూటీ […]
2016 రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త రైళ్ల ప్రతిపాదనలు ఏమీ లేకపోగా ఉన్న రైళ్లలో ఉన్న రిజర్వేషన్లకు తోడు మహిళలకు, సీనియర్ సిటిజన్‌లకు రిజర్వేషన్ శాతం పెంచారు. ఈ నిర్ణయం మంచిదే. అయితే సాధారణ ప్రయాణికుల పరిస్థితి ఏమిటి?
ఇప్పటికే ఉన్న రిజర్వుడు సీట్లలో తత్కాల్ కోటా, ప్రీమియమ్ తత్కాల్ కోటా, ఈక్యూ కోటా, ఫిజికల్ హ్యాండీ క్యాప్‌డ్ కోటా, లేడీస్ కోటా, డిఫెన్స్ కోటా, ఫారిన్ టూరిస్టుల కోటా, యువ కోటా, డ్యూటీ పాస్ కోటా, పార్లమెంట్ హౌస్ కోటా తదితర కోటాలన్నీ పోగా రిజర్వేషన్ దొరకడమే గగనమై పోయింది. రెండు మూడు నెలల ముందు కూడా టికెట్ దొరకని పరిస్థితి.
భారత జనాభాకు తగినట్లుగా, ప్రజల ప్రయాణ అవసరాలకు తగినట్లుగా రైళ్లను నడపలేకపోతున్నారు. ఉన్న రైళ్లలో ఇలా రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతే ఇక టికెట్లు దొరకని ప్రజలు రైళ్లలోనూ రాష్ట్రాల వారీ రిజర్వేషన్లు, ప్రాంతీయ రిజర్వేషన్లు, స్టేషన్లవారి రిజర్వేషన్లు, ఇంకా ముందుకు వెళ్లి కులాలవారి రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు ప్రారంభిస్తారేమో!
Click on image to read: