ఇక... ఈ-టాయ్‌లెట్స్!
బెంగళూరులో ఈ-టాయ్‌లెట్స్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతేకాక అవి ఎక్కడ ఉన్నాయో తెలిపే యాప్‌ని సైతం రూపొందించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలిక్ ఈ యాప్‌కి రూపకల్పన చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోనుల్లో మాత్రమే లభ్యమయ్యే ఈ యాప్, నగరంలో ఈ- టాయ్‌లెట్స్ ఎక్కడ ఉన్నాయి అనే సమాచారంతో పాటు వాటి తాలూకూ అన్ని వివరాలు తెలియజేస్తుంది. 75 ఈ-టాయ్‌లెట్స్‌తో ఈ పథకాన్ని ప్రారంభించారు. తరువాత మరో 100 యూనిట్లు ఏర్పాటుచేస్తారు. వీటిని వినియోగించుకున్న వారు, నిర్వహణ […]
బెంగళూరులో ఈ-టాయ్‌లెట్స్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతేకాక అవి ఎక్కడ ఉన్నాయో తెలిపే యాప్‌ని సైతం రూపొందించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలిక్ ఈ యాప్‌కి రూపకల్పన చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోనుల్లో మాత్రమే లభ్యమయ్యే ఈ యాప్, నగరంలో ఈ- టాయ్‌లెట్స్ ఎక్కడ ఉన్నాయి అనే సమాచారంతో పాటు వాటి తాలూకూ అన్ని వివరాలు తెలియజేస్తుంది.
75 ఈ-టాయ్‌లెట్స్‌తో ఈ పథకాన్ని ప్రారంభించారు. తరువాత మరో 100 యూనిట్లు ఏర్పాటుచేస్తారు. వీటిని వినియోగించుకున్న వారు, నిర్వహణ విషయంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే, ఆయా టాయ్‌లెట్ల ఫొటోలు పంపుతూ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇందులో అన్ని పనులను ఎలక్ట్రానిక్ యంత్రాంగమే చేస్తుంది, మనిషి లోపలికి వెళ్లగానే లైట్లు వేయడం నుండి, మనిషి బయటకు వచ్చాక, లోపల శుభ్రం చేయడం వరకు అన్నీ ఎలక్ట్రానిక్ విధానంలోనే జరుగుతాయి.
అయిదుసార్లు వాడిన తరువాత టాయిలెట్ నేల సెన్సార్ల సహాయంతో దానికదే శుభ్రం చేసుకుంటుంది. దీని నిర్వహణను సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చారు. కానీ బెంగళూరు మున్సిపల్ అధికారులు మాత్రం ప్రజలు యాప్ ద్వారా ఇచ్చే కంప్లయింట్లను గమనిస్తూ ఉంటారు. సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ స్పందించకపోతే చర్యలు తీసుకుంటారు.
ఒకటి రెండు లేదా ఐదు రూపాయిల కాయిన్స్‌ని ఈ టాయ్‌లెట్ ఆమోదిస్తుంది. నాణెం వేయగానే తలుపు తెరుచుకుంటుంది, మనిషి వెళ్లగానే ఉష్ణోగ్రతలో తేడాని కంట్రోల్ సెన్సార్లు గమనిస్తాయి. దాంతో లైట్లు వెలుగుతాయి, ఫ్యాన్లు తిరుగుతాయి. టాయ్‌లెట్ ఎలా పనిచేస్తుందో కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ఒక వాయిస్ చెబుతుంది. ఫ్లష్ బటన్ కూడా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. నేలకూడా ఆటోమేటిక్‌గా నీళ్లతో శుభ్రమవుతుంది. ఒక్క యూనిట్ ఏర్పాటుకి, రెండేళ్ల నిర్వహణ ఖర్చులు, పన్నులతో కలిపి 5.6 లక్షల రూపాయిలు ఖర్చవుతుంది.