లివర్ సిర్రోసిస్‌కి కాఫీతో చెక్!
రోజుకి రెండు కప్పుల కాఫీ తాగుతుంటే లివర్ సిర్రోసిస్ ప్రమాదం 44శాతం వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని సౌత్ హ్యాంప్టన్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. 4లక్షల 30వేల మందిపై నిర్వహించిన తొమ్మిది అధ్యయనాల తాలూకూ డాటాని పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. పైగా కప్పుల సంఖ్యని పెంచిన కొద్దీ లివర్ సిర్రోసిస్ వచ్చే అవకాశం తగ్గుముఖం పడుతున్నట్టుగా కూడా గుర్తించారు. ఒక కప్పు కాఫీ ప్రమాద రిస్క్‌ని 22శాతం తగ్గిస్తే. రెండు కప్పులు 44 శాతం, మూడు […]
రోజుకి రెండు కప్పుల కాఫీ తాగుతుంటే లివర్ సిర్రోసిస్ ప్రమాదం 44శాతం వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని సౌత్ హ్యాంప్టన్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. 4లక్షల 30వేల మందిపై నిర్వహించిన తొమ్మిది అధ్యయనాల తాలూకూ డాటాని పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. పైగా కప్పుల సంఖ్యని పెంచిన కొద్దీ లివర్ సిర్రోసిస్ వచ్చే అవకాశం తగ్గుముఖం పడుతున్నట్టుగా కూడా గుర్తించారు.
ఒక కప్పు కాఫీ ప్రమాద రిస్క్‌ని 22శాతం తగ్గిస్తే. రెండు కప్పులు 44 శాతం, మూడు కప్పులు 57శాతం, నాలుగు కప్పులు 65శాతం రిస్క్‌ని తగ్గిస్తాయట. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 10లక్షలకంటే ఎక్కువమంది లివర్ సిర్రోసిస్‌తో మరణిస్తున్నారు. మితిమీరిన ఆల్కహాల్ సేవనం, రోగనిరోధక శక్తి డిజార్డర్లు, హెపటైటిస్, ఫ్యాటీ లివర్ ఇవన్నీ ఈ అనారోగ్యానికి కారణాలవుతున్నాయి.
అయితే కాఫీ, లివర్‌కి ఎలా మేలుచేస్తుందన్న సంగతిని తామిప్పుడే చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు. కాఫీలో వందల రకాల రసాయనిక అంశాలు ఉండటం వలన లివర్‌ని రక్షించడంలో ఏది దోహదపడుతుందో చెప్పలేమని వారు అంటున్నారు. అలాగే ఆరోగ్యం కోసం ఎక్కువమొత్తంలో కాఫీ తాగే అలవాటు చేసుకోవడం కూడా మంచి విషయం కాదని వారు చెబుతున్నారు. ఎందుకంటే రోజుకి అయిదు కప్పులకు మించి కాఫీ సేవిస్తే పొత్తికడుపులో కొవ్వు పేరుకుంటుందని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే కాఫీతో పాటు పాలు, పంచదార కూడా మన పొట్టలోకి వెళతాయి కనుక అవి కూడా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని వారు హెచ్చరిస్తున్నారు. కాఫీలో ఏ అంశం లివర్‌కి మేలు చేస్తున్నదనే సంగతి తేలితే కానీ ఏ హానీలేకుండా ప్రయోజనం పొందే అవకాశం ఉండదు.