తన పార్ట్ పూర్తిచేసిన శృతిహాసన్
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా కొనసాగుతున్న శృతిహాసన్… ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాల్ని పూర్తిచేస్తోంది. ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాంతో సినిమాను కంప్లీట్ చేసిన శృతిహాసన్… తాజాగా తెలుగులో కూడా ఓ మూవీని ఫినిష్ చేసింది. నాగచైతన్య సరసన ప్రేమమ్ రీమేక్ లో నటిస్తోంది శృతిహాసన్. ఈ మూవీకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసింది. అంటే… నాగచైతన్య-శృతిహాసన్ మధ్య వచ్చే సన్నివేశాల షూటింగ్ అయిపోయిందన్నమాట. అయితే ఇద్దరి మధ్య వచ్చే ఓ రొమాంటిక్ […]

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా కొనసాగుతున్న శృతిహాసన్… ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాల్ని పూర్తిచేస్తోంది. ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాంతో సినిమాను కంప్లీట్ చేసిన శృతిహాసన్… తాజాగా తెలుగులో కూడా ఓ మూవీని ఫినిష్ చేసింది. నాగచైతన్య సరసన ప్రేమమ్ రీమేక్ లో నటిస్తోంది శృతిహాసన్. ఈ మూవీకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసింది. అంటే… నాగచైతన్య-శృతిహాసన్ మధ్య వచ్చే సన్నివేశాల షూటింగ్ అయిపోయిందన్నమాట.
అయితే ఇద్దరి మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ మాత్రం ఇంకా మిగిలే ఉంది. హిందీలో చేస్తున్న సినిమాకు సంబంధించి కాల్షీట్లు క్లియర్ అయిపోయిన తర్వాత… విదేశాల్లో ఆ పాటను చిత్రీకరిస్తారు. మరోవైపు ఎన్నడూ లేని విధంగా నాగచైతన్య చేస్తున్న ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఇప్పటికే శాటిలైట్ రైట్స్ తో కలుపుకొని… దాదాపు 25 కోట్ల రూపాయలకు అమ్మేశారని చెబుతున్నారు.