బాబుకు ఆ నాలుగు ఉన్నాయా?.. మీడియాకు జగన్ క్లాస్
కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్ మరోసారి చంద్రబాబు, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా సంస్థలపై మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ అన్నవి కొద్దిగైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. పార్టీల పునాదులు కదలాలంటే అది ప్రజల చేతిలో ఉంటుందని… చినబాబు , పెదబాబు చేతుల్లో ఉండదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా […]
కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్ మరోసారి చంద్రబాబు, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా సంస్థలపై మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ అన్నవి కొద్దిగైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. పార్టీల పునాదులు కదలాలంటే అది ప్రజల చేతిలో ఉంటుందని… చినబాబు , పెదబాబు చేతుల్లో ఉండదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. చంద్రబాబుకు సిగ్గు,లజ్జ, దమ్ము, ధైర్యం ఈ నాలుగింటిలో ఏది ఉన్నా ఆ పని చేయాలని రెండోసారి కూడా సవాల్ చేశారు. అసలు చంద్రబాబు రాక్షసుడిగా పుట్టాల్సిన వ్యక్తి అని అన్నారు.
టీవీ చానళ్లు కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసే నీచపు పనులను ఎండగట్టాల్సింది పోయి వంతపాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతే కథనాలు రాస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ నిత్యం ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారంటూ పేర్లతో సహా ఎందుకు పుకార్లు ప్రసారం చేస్తున్నారని ప్రశ్నించారు. మీడియాకు నైతికత లేదా అని ప్రశ్నించారు. కథనాలను ఎమ్మెల్యేలు ఖండించిన తర్వాత కూడా తిరిగి సదరు ఎమ్మెల్యేలపై కథనాలు రాయడం మీడియాకు ఎంతవరకు సమంజసమన్నారు. చివరకు వయసులో పెద్దవాడైన రఘురామిరెడ్డి అన్నపైనా తప్పుడు కథనాలు రాస్తుంటే ఇంకేమనాలని జగన్ ప్రశ్నించారు.
ఉంగరం లేదు, వాచ్ లేదు… జేబులో డబ్బు లేవని నీతులు చెప్పే చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్లు ఎలా ఇచ్చి కొంటున్నారని జగన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన చోట వారి కన్నా బలమైన నాయకత్వం వస్తుందన్నారు. ఎమ్మెల్యేలు వెళ్లడం సమస్యే కాదని.. కానీ వారి చేత రాజీనామా చేయించి సొంత గుర్తుపై గెలిపించుకోవాలని మాత్రమే చంద్రబాబుకు తాము సవాల్ చేస్తున్నామన్నారు . పోలీసులు, అధికార బలం, అర్ధబలంతో రాజకీయాలు ఎంతో కాలం చేయలేరన్నారు. జనం తిరగబడిన నాడు బాబు బంగాళాఖాతంలో కలవాల్సిందేనన్నారు జగన్.
Click on image to read: