అలూ లేదు చూలూ లేదు అప్పుడే ప్రతీకారాలా... భూమా!
టీడీపీలోకి భూమా ఎంట్రీ జరిగి వారం కూడా పూర్తి కాలేదు. అప్పుడే కర్నూలు జిల్లా టీడీపీలో అధిపత్య పోరు మొదలైంది. భూమా, శిల్పా వర్గాలు పవర్‌పై పట్టు కోసం పోరాటం మొదలుపెట్టాయి. శిల్పామోహన్ రెడ్డికి చెందిన కేబుల్ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు భూమా వర్గం రంగంలోకి దిగిందన్న వార్తలతో టీడీపీలో ఒక్కసారిగా వేడి రగిలింది. జిల్లాలోని నందికొట్కూరు, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలలో శిల్పాకు కేబుల్ వ్యాపారం ఉంది. అయితే కేబుల్ వైర్లను కరెంట్ స్తంభాలపై ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తీసుకున్నారా […]
టీడీపీలోకి భూమా ఎంట్రీ జరిగి వారం కూడా పూర్తి కాలేదు. అప్పుడే కర్నూలు జిల్లా టీడీపీలో అధిపత్య పోరు మొదలైంది. భూమా, శిల్పా వర్గాలు పవర్‌పై పట్టు కోసం పోరాటం మొదలుపెట్టాయి. శిల్పామోహన్ రెడ్డికి చెందిన కేబుల్ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు భూమా వర్గం రంగంలోకి దిగిందన్న వార్తలతో టీడీపీలో ఒక్కసారిగా వేడి రగిలింది.
జిల్లాలోని నందికొట్కూరు, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలలో శిల్పాకు కేబుల్ వ్యాపారం ఉంది. అయితే కేబుల్ వైర్లను కరెంట్ స్తంభాలపై ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తీసుకున్నారా లేదా అన్నదానిపై విద్యుత్ శాఖ అధికారులను భూమా వర్గం ఆరా తీసిందని సమాచారం. ఒకవేళ శిల్పా మోహన్ రెడ్డి సంస్థ అనుమతులు తీసుకుని ఉండకపోతే త్వరలోనే వాటిని తొలగించడం ఖాయమని భూమా వర్గీయులు చెబుతున్నారు. అదేలా అంటే త్వరలోనే భూమా నాగిరెడ్డి మంత్రి అవుతారని, విద్యుత్ శాఖను అప్పగిస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి భూమా శాఖకు చెందిన విద్యుత్ స్తంభాలపై శిల్పా కేబుల్స్ ఎలా ఉంటాయో చూస్తామంటున్నారు. ఒక విధంగా తమ జోలికి వస్తే జరగబోయే పరిణామాలపై శిల్పా సోదరులకు భూమా వర్గం ఇప్పటి నుంచే హెచ్చరికలు పంపుతోందని భావిస్తున్నారు.
భూమాకు ధీటుగా బదులిచ్చేందుకు అటు శిల్పా వర్గీయులు కూడా సిద్ధమవుతున్నారు. జిల్లాలోని ముఖ్యనేతల మద్దతు పొందేందుకు శిల్పా వర్గం ప్రయత్నిస్తోంది. నాగిరెడ్డి, అఖిలప్రియ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లకే అధికారాలు ఇవ్వాలంటూ శిల్పా వర్గం ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా జిల్లాలోని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను కూడగట్టే పనిలో జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. జిల్లా నుంచి కీలక పదవులు నిర్వహిస్తున్న నేతలు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా శిల్పా వర్గానికే మద్దతు తెలుపుతున్నారు. నిన్నకాకమొన్న పార్టీలోకి వచ్చిన భూమా ఆధిపత్యాన్ని ఒప్పుకునేది లేదంటున్నారు. చూడాలి ఈ గేమ్‌లో ఎవరిది పై చేయి అవుతుందో!.
Click on image to read: