లోకేష్‌పై విరుచుకుపడ్డ రోజా... ఈ రేంజ్‌లో చినబాబుకు ఫస్ట్ టైమ్ కాబోలు
చంద్రబాబు తనయుడు లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . బహుశా లోకేష్‌ను ఈ రేంజ్ లో ఇటీవల ఎవరూ విమర్శించి ఉండరు. తండ్రి అధికారం చూసుకుని వానపాము లాంటి లోకేష్ కూడా నాగుపాములా బుసకొడుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. తెలంగాణలో అవాకులు చెవాకులు పేలి టీడీపీని ఖాళీ చేయించిన ఘనత లోకేష్‌కే దక్కుతుందన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీని ఖాళీ చేయించేందుకు లోకేష్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌కు దమ్ముంటే ఒక్క రోజులో […]
చంద్రబాబు తనయుడు లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . బహుశా లోకేష్‌ను ఈ రేంజ్ లో ఇటీవల ఎవరూ విమర్శించి ఉండరు. తండ్రి అధికారం చూసుకుని వానపాము లాంటి లోకేష్ కూడా నాగుపాములా బుసకొడుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. తెలంగాణలో అవాకులు చెవాకులు పేలి టీడీపీని ఖాళీ చేయించిన ఘనత లోకేష్‌కే దక్కుతుందన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీని ఖాళీ చేయించేందుకు లోకేష్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
జగన్‌కు దమ్ముంటే ఒక్క రోజులో ప్రభుత్వాన్ని కూల్చాలని లోకేష్ అనడంపై స్పందించిన రోజా… లోకేష్‌లా దిక్కుమాలిన ఆలోచనలు చేసే వ్యక్తి జగన్ కాదన్నారు. లోకేష్ కు దమ్ముంటే వైసీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలనైనా తీసుకెళ్లాలని కానీ… లోకేష్‌కు సిగ్గుసెరం,మానం, మర్యాద ఉంటే వారి చేత రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోవాలని రోజా సవాల్ విసిరారు. అలా చేస్తే మీ ఫేస్ వ్యాల్యూ ఎంతో ప్రజలే తేలుస్తారన్నారు.
వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా పార్టీ కోసం ప్రాణాలు వదిలిన కుటుంబాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబు దారిలోనే లోకేష్ కూడా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు.
Click on image to read: