కమల్ హాసన్ ప్రొడ్యూసర్ ఆస్తుల అమ్మకానికి...!
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో తరుచుగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా నిర్మాతలకు సినిమా బిజినెస్ పట్ల .. కథల ఎంపిక పట్ల.. హీరో మార్కెట్ రేంజ్ వంటి విషయాల్లో సరైన అవగాహన లేకుండా చిత్రాలు చేస్తే.. కచ్చితంగా ఆస్కార్ రవిచంద్రన్ లానే వుంటుంది. అస్కార్ రవిచంద్రన్ అంటే భారీ చిత్రాల నిర్మాత అని పేరు ఉంది. శంకర్ సక్సెస్ ట్రాక్ ను నమ్ముకుని.. విక్రమ్..శంకర్ కాంబినేష న్ లో వచ్చిన ఐ చిత్రం కోసం […]
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో తరుచుగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా నిర్మాతలకు సినిమా బిజినెస్ పట్ల .. కథల ఎంపిక పట్ల.. హీరో మార్కెట్ రేంజ్ వంటి విషయాల్లో సరైన అవగాహన లేకుండా చిత్రాలు చేస్తే.. కచ్చితంగా ఆస్కార్ రవిచంద్రన్ లానే వుంటుంది. అస్కార్ రవిచంద్రన్ అంటే భారీ చిత్రాల నిర్మాత అని పేరు ఉంది. శంకర్ సక్సెస్ ట్రాక్ ను నమ్ముకుని.. విక్రమ్..శంకర్ కాంబినేష న్ లో వచ్చిన ఐ చిత్రం కోసం దాదాపు 100 కోట్లు పెట్టు బడి పెట్టారు. కట్ చేస్తే..బొమ్మ డిజాస్టర్ అయ్యింది. దాని అప్పుల కోసం ఆస్థులు ఒక్కోకటి అమ్ముకోవడం ప్రారంభం అయ్యిందనే వార్తలు అప్పట్లో వనిపించాయి.
ఇక తాజా సమచారం ఏమిటంటే.. కమల్ హాసన్ తో చేసిన విశ్వరూపం 2 చిత్రం కూడ ఇంత వరకు రిలీజ్ కాలేదు. అటు నిర్మాతకు..ఇటు హీరో కమల్ కు ఎక్కడో బేదాభిప్రాయాలు రావడంతో.. ఆ ప్రాజెక్ట్ విడుదలకు నోచుకోవడం లేదు అనేది ఒక టాక్. అసలే ఐ చిత్రం పెట్టిన అప్పులు చాలవన్నట్లు.. విశ్వరూపం 2 చిత్రం పై దాదాపు 40 కోట్లు వరకు బడ్జెట్ పెట్టారట. ఈ సినిమా రిలీజ్ కాక పోవడంతో.. అప్పులు తీర్చడానికి కోయంబత్తూర్ లో వున్న 35 కోట్ల ఆస్థిని అమ్మకానికి పెట్టారట. ప్రాపర్టీ అమ్మకం ఏకంగా న్యూస్ పేపర్ లోనే ఇవ్వడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఒకింత షాక్ గురైనట్లు చెబుతున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అస్కార్ రవిచంద్రన్.. ఐ చిత్రం నుంచి అప్పుల పాలు కావడం తమిళ ఇండస్ట్రీ తో పాటు..తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రొడ్యూసర్స్ సర్కిల్లో బిగ్ డిబేట్ అయ్యింది మరి.