టీడీపీలో చేరిన మరో వైసీపీ ఎంఎల్ఏ
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. నలుగురు ఎమ్మెల్యేలను ఆర్భాటంగా పార్టీలో చేర్చుకున్న టీడీపీ… ఈసారి సైలెంట్‌గా మరో ఎమ్మెల్యేను సైకిల్ ఎక్కించుకుంది. కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా వేసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్టు జయరాములు తెలిపారు. ఓట్లేసి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్న ఉద్దేశంతోనే పార్టీ మారుతున్నట్టు చెప్పారు . జగన్ తీరు బాగోలేకనే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నట్టు వస్తున్న విమర్శలతో తాను ఏకీభవించననని జయరాములు […]
BY sarvi24 Feb 2016 7:35 AM IST
X
sarvi Updated On: 25 Feb 2016 6:09 AM IST
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. నలుగురు ఎమ్మెల్యేలను ఆర్భాటంగా పార్టీలో చేర్చుకున్న టీడీపీ… ఈసారి సైలెంట్‌గా మరో ఎమ్మెల్యేను సైకిల్ ఎక్కించుకుంది. కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా వేసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్టు జయరాములు తెలిపారు.
ఓట్లేసి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్న ఉద్దేశంతోనే పార్టీ మారుతున్నట్టు చెప్పారు . జగన్ తీరు బాగోలేకనే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నట్టు వస్తున్న విమర్శలతో తాను ఏకీభవించననని జయరాములు చెప్పడం విశేషం. జయరాములను పయ్యావుల కేశవ్, జూపూడి ప్రభాకర్ లు… చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు. రాష్ట్రం భవిష్యత్తు కోసమే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని పయ్యావుల కేశవ్ చెప్పారు.
అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని కాబట్టి ఉప ఎన్నికలు ఎందుకొస్తాయని ఎమ్మెల్యే బోండా ఉమ ప్రశ్నించారు.
Next Story