జగన్‌తో కలిసి ఫొటోలకు జేసీ ఫోజులు
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, జగన్ తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇద్దరూ కుశల ప్రశ్నలేసుకున్నారు. జేసీ జోకులకు జగన్ తోపాటు అందరూ నవ్వుకున్నారు. ఈసన్నివేశానికి ఢిల్లీలోకి పార్లమెంట్ ప్రాంగణం వేదికైంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి జగన్ బయటకు వస్తున్న సమయంలో జేసీ ఎదురెళ్లారు. జగన్‌తో పాటు వైసీపీ ఎంపీలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. కొందరు మీడియా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఫొటోలకు ఫోజు ఇచ్చారు. ”జగన్‌తో ఫొటోలు దిగుతున్నారు ఇబ్బందులు రావా” […]
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, జగన్ తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇద్దరూ కుశల ప్రశ్నలేసుకున్నారు. జేసీ జోకులకు జగన్ తోపాటు అందరూ నవ్వుకున్నారు. ఈసన్నివేశానికి ఢిల్లీలోకి పార్లమెంట్ ప్రాంగణం వేదికైంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి జగన్ బయటకు వస్తున్న సమయంలో జేసీ ఎదురెళ్లారు. జగన్‌తో పాటు వైసీపీ ఎంపీలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. కొందరు మీడియా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఫొటోలకు ఫోజు ఇచ్చారు. ”జగన్‌తో ఫొటోలు దిగుతున్నారు ఇబ్బందులు రావా” అని మీడియా వాళ్లు ప్రశ్నించగా జేసీ తనదైన శైలిలో స్పందించారు. ”చంద్రబాబుకు చెప్పి ఏదో చేయాలనుకుంటున్నారా… చేయండి” అంటూ బదులిచ్చారు. దీంతో జగన్‌తో పాటు అక్కడుకున్న వారంతా నవ్వుకున్నారు. అనంతరం జేసీ పార్లమెంట్ లోపలికి వెళ్లారు.
రాజనాథ్ సింగ్‌ను కలిసి జగన్ బృందం ప్రత్యేక హోదా, నియోజకవర్గాల పెంపు తదితర అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల పెంపుపై రాజ్ నాథ్ కూడా ఏమీ చెప్పలేకపోయారని ఎంపీ మేకపాటి అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు రాజకీయాలను ఆయన తప్పుపట్టారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి నేతలు వెళ్లిపోవడం దారుణమన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కేవలం ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ఆ రోజు కావాలనుకుంటే తనకున్న అధికార బలంతో వాజ్‌పేయి నలుగురైదుగురు ఎంపీలను తెప్పించుకోవడం పెద్ద పని కాదన్నారు. కానీ విలువలకు కట్టుబడి ఏకంగా ప్రధాని పదవినే వదులుకున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన అధికార పార్టీ బలపడిన దాఖలాలు లేవన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే ప్రతిపక్షంగా మారి ప్రభుత్వంపై తిరుగబడుతారన్నారు.
Click on image to read: