Telugu Global
Cinema & Entertainment

గోల్డెన్ స్టారా..? రోల్డ్ గోల్డ్ స్టారా ?

టైమ్ బాగోలేక పోతే తాడు కూడా పాము అయి కరుస్తది అని అంటారు. తాజాగా కామెడి చిత్రాలు చేస్తున్న సునిల్ ప‌రిస్థితి అలాగే ఉందంటున్నారు ప‌రిశీల‌కులు. కామెడి ఆర్టిస్ట్ గా ఉన్న‌ప్పుడు .. కనీసం ఇంటి ద‌గ్గ‌ర ఒక గంట కూడా ఖాళీ వుండేది కాదు. కానీ .. ఆయ‌న జాత‌కం బాగుండి అందాల రాముడితో హీరోగా ఎంట్రీ కొట్టాడు. అయితే అంత‌గా మెప్పించ‌లేదు. అయితే ఏ ముహుర్తానా..రాజ‌మౌళి…సునిల్ ను పెట్టి మ‌ర్యాద రామ‌న్న అనుకున్నాడో..ఆ చిత్రం […]

గోల్డెన్ స్టారా..? రోల్డ్ గోల్డ్ స్టారా ?
X

టైమ్ బాగోలేక పోతే తాడు కూడా పాము అయి కరుస్తది అని అంటారు. తాజాగా కామెడి చిత్రాలు చేస్తున్న సునిల్ ప‌రిస్థితి అలాగే ఉందంటున్నారు ప‌రిశీల‌కులు. కామెడి ఆర్టిస్ట్ గా ఉన్న‌ప్పుడు .. కనీసం ఇంటి ద‌గ్గ‌ర ఒక గంట కూడా ఖాళీ వుండేది కాదు. కానీ .. ఆయ‌న జాత‌కం బాగుండి అందాల రాముడితో హీరోగా ఎంట్రీ కొట్టాడు. అయితే అంత‌గా మెప్పించ‌లేదు. అయితే ఏ ముహుర్తానా..రాజ‌మౌళి…సునిల్ ను పెట్టి మ‌ర్యాద రామ‌న్న అనుకున్నాడో..ఆ చిత్రం సునిల్ జాత‌కం మార్చింది. దీంతో హీరో గా ఎస్టాబ్లీష్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ చేసి పూల‌రంగ‌డు తో మ‌రో హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌రువాత నుంచి సునిల్ కెరీర్ గాడి త‌ప్ప‌డం ప్రారంభం అయ్యింది…

ఆ త‌రువాత చేసిన మిష్ట‌ర్ పెళ్లి కొడుకు.. భీమ‌వ‌రం బుల్లోడు చిత్రాలు అంతంత మాత్ర‌మే న‌డ‌వ‌డంతో సునిల్ కు క‌ష్టాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఆ క‌ష్టాల‌న్ని దిల్ రాజ్ బ్యాన‌ర్ లో వాసు వ‌ర్మ చేసిన కృష్ణాష్ట‌మి చిత్రంతో గ‌ట్టెక్కుతాయ‌నుకుంటే.. సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఇక టైటిల్స్ లో త‌న పేరు ముందు గోల్డెన్ స్టార్ అని బిరుదు త‌గిలించి వేశారు. సునిల్ కి ఇష్టం లేకపోయినా గాని… దిల్ రాజ్ , వాసు వ‌ర్మ ఈ ప‌ని చేశార‌ని టాక్. అయితే సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఢ‌మాల్ కావ‌డంతో.. సునిల్ కు ఇప్పుడు గోల్డెన్ స్టార్ కాదు .. రోల్డ్ గోల్డ్ సార్ట్ అనే బిరుదు అయితే క‌రెక్ట్ గా స‌రిపోద్దని క్రిటిక్స్ సైటెర్స వేస్తున్నారు మ‌రి. నిజంగా ఇది పంచ్ ప‌ల్క్ నామ‌కే పంచ్ మ‌రి.

First Published:  24 Feb 2016 10:07 AM IST
Next Story