7,000 మంది బాలలను రక్షించిన తెలంగాణ పోలీస్
మనందరికీ గుర్తుండే ఉంటుంది. గత ఏడాది జనవరి 24వ తారీఖున హైదరాబాద్ భవానీ నగర్‌లో గాజుల తయారీ పరిశ్రమలో వెట్టిచాకిరీ చేస్తున్న 220 మంది బీహారీ బాలబాలికలను తెలంగాణ పోలీసులు రక్షించి బీహార్‌లోని వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకు చేర్చిన సన్నివేశాలు మనం మర్చిపోలేము. ఆ తరువాత చాంద్రాయణగుట్ట, కాలాపత్తర్, రేయిన్ బజార్‌లనుంచి 99 మందిని, కరీంనగర్ నుంచి 265 మందిని, నల్లగొండ నుంచి 234 మందిని ఈ వెట్టిచాకిరీ నుంచి రక్షించిన విషయం గుర్తుండే వుంటుంది. మొత్తంమీద […]
మనందరికీ గుర్తుండే ఉంటుంది. గత ఏడాది జనవరి 24వ తారీఖున హైదరాబాద్ భవానీ నగర్‌లో గాజుల తయారీ పరిశ్రమలో వెట్టిచాకిరీ చేస్తున్న 220 మంది బీహారీ బాలబాలికలను తెలంగాణ పోలీసులు రక్షించి బీహార్‌లోని వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకు చేర్చిన సన్నివేశాలు మనం మర్చిపోలేము. ఆ తరువాత చాంద్రాయణగుట్ట, కాలాపత్తర్, రేయిన్ బజార్‌లనుంచి 99 మందిని, కరీంనగర్ నుంచి 265 మందిని, నల్లగొండ నుంచి 234 మందిని ఈ వెట్టిచాకిరీ నుంచి రక్షించిన విషయం గుర్తుండే వుంటుంది.
మొత్తంమీద గత ఏడాది జనవరి నెలలో 1,397 మంది బాలబాలికలను వెట్టిచాకిరీనుంచి తప్పించి వాళ్లల్లో 660 మందిని తల్లిదండ్రులవద్దకు చేర్చారు. మిగిలిన పిల్లలను ప్రభుత్వ సంరక్షణాలయాలకు చేర్చారు. ఇదంతా కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ స్మైల్ పథకంలో భాగమైనప్పటికీ దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోను స్పందించనంత మానవత్వంతో తెలంగాణ పోలీసులు ఈ పథకాన్ని విజయవంతం చేసి కొందరు బాలబాలికల జీవితాల్లో వెలుగులు నింపారు.
ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ – 2 పథకాన్ని కూడా తెలంగాణ పోలీసులు విజయవంతం చేసి 5,531 మంది చిన్నారులను రక్షించారు. 83 ప్రత్యేక బృంధాలని రంగంలోకి దించిన సీఐడీ స్థానికపోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, బాలల సంరక్షణ సంస్థలు, స్థానికుల సహకారంతో వెట్టిచాకిరీ చేస్తున్న 4,173 మంది బాలురు, 1,358 మంది బాలికల్ని రక్షించారు. వీళ్లచేత వెట్టిచాకిరీ చేయిస్తున్న వాళ్లపై 448 కేసులు నమోదుచేశారు.