ఆంధ్రప్రదేశ్ పిల్లలకు... అమరావతి పాఠం!
మైక్రోసాఫ్ట్ సిఇఓగా తెలుగువారి ఘనతని పెంచిన సత్య నాదెళ్ల ఆంధ్రప్రదేశ్‌లో పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కి పిల్లల్లో స్ఫూర్తిని నింపబోతున్నారు. ఈ ఏడాది జూన్ నుండి మొదలు కాబోయే విద్యాసంవత్సరంలో ఎనిమిదవ తరగతి తెలుగు నాన్‌డిటైల్డ్ పుస్తకంలో సత్యనాదెళ్ల జీవిత కథని చేర్చనున్నారు. ఆయనతో పాటు పర్వతాధిరోహకుడు మల్లి మస్తాన్ బాబు, చిత్రకారుడు రచయిత సంజీవ్‌దేవ్ జీవితాలను కూడా స్ఫూర్తి ప్రదాతలుగా ఇందులో చేరుస్తున్నారు. ఆరునుండి పదివరకు తెలుగు నాన్‌డిటైల్డ్, ఒకటినుండి అయిదు తరగతుల వరకు ఇంగ్లీషు టెక్ట్స్ పుస్తకాల […]
మైక్రోసాఫ్ట్ సిఇఓగా తెలుగువారి ఘనతని పెంచిన సత్య నాదెళ్ల ఆంధ్రప్రదేశ్‌లో పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కి పిల్లల్లో స్ఫూర్తిని నింపబోతున్నారు. ఈ ఏడాది జూన్ నుండి మొదలు కాబోయే విద్యాసంవత్సరంలో ఎనిమిదవ తరగతి తెలుగు నాన్‌డిటైల్డ్ పుస్తకంలో సత్యనాదెళ్ల జీవిత కథని చేర్చనున్నారు. ఆయనతో పాటు పర్వతాధిరోహకుడు మల్లి మస్తాన్ బాబు, చిత్రకారుడు రచయిత సంజీవ్‌దేవ్ జీవితాలను కూడా స్ఫూర్తి ప్రదాతలుగా ఇందులో చేరుస్తున్నారు.
ఆరునుండి పదివరకు తెలుగు నాన్‌డిటైల్డ్, ఒకటినుండి అయిదు తరగతుల వరకు ఇంగ్లీషు టెక్ట్స్ పుస్తకాల సిలబస్‌ల్లో మార్పులు తేవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు, ఆయిల్ సాంకేతిక నిపుణుడు స్వర్గీయ ఎస్‌డి తిరుమల రావుల జీవితాంశాలను తొమ్మిదో తరగతి తెలుగు నాన్‌డిటైల్డ్ పుస్తకంలో ప్రచురిస్తున్నారు.
ఈ మార్పులతో పాటు మరికొన్ని కొత్త పాఠ్యాంశాలను తరగతి పుస్తకాల్లోకి తేనున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కన్నెగంటి హనుమంతు లాంటి ప్రముఖులతో పాటు స్థానిక పండుగలు, ఆచారాలు సంప్రదాయాలను వివరించే మార్పులు ఆరవ తరగతి తెలుగు నాన్‌డిటైల్డ్ లో, కూచిపూడి, హరికథ, బుర్రకథ, తప్పెటగుళ్లు, కుర్రావంజీ ఏడవ తరగతి తెలుగు నాన్‌డిటైల్డ్ పుస్తకంలో ఉండబోతున్నాయి.
పదవతరగతి తెలుగుపాఠంగా మన రాజధాని… పేరుతో అమరావతి చారిత్రకాంశాలతో పాటు రూపుదిద్దుకోనుకున్న అమరావతి రాజధాని గురించి కూడా వివరించబోతున్నారు. ఏడో తరగతి తెలుగు నాన్‌డిటైల్డ్ పుస్తకంలో విద్య ప్రాధాన్యత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ఆవశ్యకత గురించిన పాఠాలను చేరుస్తున్నారు.