ఆ గాలి పీలిస్తే... అధిక బరువు!
మనం సృష్టిస్తున్న కాలుష్యం…మనల్నే తినేస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పచ్చని ప్రకృతి, ప్రాణవాయువుల్లో మనం అనేక రకాలుగా కాలుష్యాన్ని నింపుతున్నాం. పెరుగుతున్న కాలుష్యం మనకు అధికబరువునీ, కొలెస్ట్రాల్ ముప్పునీ, మధుమేహాన్ని కూడా తెచ్చిపెడు తోందని ఒక అధ్యయనం చెబుతోంది. అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు ఎలుకలమీద ఈ పరిశోధనలు నిర్వహించారు. చైనా బీజింగ్ రోడ్లమీద బాగా కాలుష్యపూరితమైన గాలిని ఎలుకలు పీల్చుకునేలా చేసి చూశారు. ఈ గాలిని పీల్చుకున్న ఎలుకలు బరువు పెరిగినట్టుగా గుండె, శ్వాసకోశ, […]
మనం సృష్టిస్తున్న కాలుష్యం…మనల్నే తినేస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పచ్చని ప్రకృతి, ప్రాణవాయువుల్లో మనం అనేక రకాలుగా కాలుష్యాన్ని నింపుతున్నాం. పెరుగుతున్న కాలుష్యం మనకు అధికబరువునీ, కొలెస్ట్రాల్ ముప్పునీ, మధుమేహాన్ని కూడా తెచ్చిపెడు తోందని ఒక అధ్యయనం చెబుతోంది.
అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు ఎలుకలమీద ఈ పరిశోధనలు నిర్వహించారు. చైనా బీజింగ్ రోడ్లమీద బాగా కాలుష్యపూరితమైన గాలిని ఎలుకలు పీల్చుకునేలా చేసి చూశారు. ఈ గాలిని పీల్చుకున్న ఎలుకలు బరువు పెరిగినట్టుగా గుండె, శ్వాసకోశ, మెటబాలిక్ సమస్యలకు గురయినట్టుగా గుర్తించారు.
ఈ గాలిని పీల్చిన గర్భంతో ఉన్న ఆడ ఎలుకల్లో ఊపిరితిత్తులు, లివర్ సమస్యలు పెరిగాయి. ఆయాభాగాల కణజాలంలో వాపు గుణం కూడా మరింతగా పెరిగింది. కాలుష్యంలో ఉన్న ఎలుకలకూ, కాలుష్యంలేని గాలిని పీల్చిన ఎలుకలకూ ఆరోగ్యంలో తేడాలు చాలా స్పష్టంగా 19 రోజుల్లో కనిపించాయి.
తీవ్రమైన వాపు లక్షణం అధికబరువుకి కారణమవుతుంది. అలాగే మధుమేహం, అధికబరువు లాంటి మెటబాలిక్ వ్యాధులు కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. దీన్ని బట్టి తాము చేసిన పరిశోధనలో తీవ్రమైన వాయు కాలుష్యం ఒబేసిటీని పెంచుతుందని స్పష్టంగా తేలిందని డ్యూక్ యూనివర్శిటీ సైంటిస్టు జన్‌ఫెంగ్ జాంగ్ అంటున్నారు. ఈ పరిశోధనను మనుషులకు అన్వయించి చూస్తే అత్యవసరంగా కాలుష్యాన్ని నివారించాలని మనకు అర్థమవుతుందని జాంగ్ అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్ ఫర్ ఎక్స్‌పెరమెంటల్ బయాలజీ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురించారు.