కేసీఆర్ దర్శకత్వంలో బాబు
ఓటుకు నోటు వ్యవహారంతో కేసీఆర్ చంద్రబాబును పాదాక్రాంతం చేసుకున్నాక చంద్రబాబును ఆడించే రిమోట్ కేసీఆర్ చేతికి వచ్చింది. దాంతో చంద్రబాబు ఆయన అనుకూల మీడియా మొత్తం దారికొచ్చింది. ఆంధ్రాలో చంద్రబాబుకు భజన చేసినట్టే తెలంగాణాలో కేసీఆర్ భజన ప్రారంభించారు. కమ్మ సామాజిక వర్గం కూడా కేసీఆర్ పై వ్యతిరేకతను దాదాపు పూర్తిగా తుడిచేసుకుంది. తమ నాయకుడు చేయలేని పనిని కేసీఆర్ చేసినందుకు వైసీపీ అభిమానులు కూడా కేసీఆర్‌పట్ల అభిమానం పెంచుకున్నారు. కేసీఆర్ పాలన చూశాక ఆంధ్రా ప్రజలు […]
ఓటుకు నోటు వ్యవహారంతో కేసీఆర్ చంద్రబాబును పాదాక్రాంతం చేసుకున్నాక చంద్రబాబును ఆడించే రిమోట్ కేసీఆర్ చేతికి వచ్చింది. దాంతో చంద్రబాబు ఆయన అనుకూల మీడియా మొత్తం దారికొచ్చింది. ఆంధ్రాలో చంద్రబాబుకు భజన చేసినట్టే తెలంగాణాలో కేసీఆర్ భజన ప్రారంభించారు. కమ్మ సామాజిక వర్గం కూడా కేసీఆర్ పై వ్యతిరేకతను దాదాపు పూర్తిగా తుడిచేసుకుంది.
తమ నాయకుడు చేయలేని పనిని కేసీఆర్ చేసినందుకు వైసీపీ అభిమానులు కూడా కేసీఆర్‌పట్ల అభిమానం పెంచుకున్నారు.
కేసీఆర్ పాలన చూశాక ఆంధ్రా ప్రజలు చంద్రబాబు పాలనతో పోల్చుకొని కేసీఆర్ పాలనను చాలామంది మెచ్చుకుంటున్నారు. కొంతమంది ఆంధ్రావాళ్లు కేసీఆర్ అభిమానులుగా కూడా మారారు. చంద్రబాబు మీద కోపం ఉన్నవాళ్లు చాలామంది కేసీఆర్ అభిమానులయ్యారు. ముఖ్యంగా రెడ్డి, కాపు సామాజిక వర్గాల్లో చాలామంది కేసీఆర్‌ని అభిమానిస్తున్నారు. జగన్ స్ట్రాటజీ సరైనదేనని, తెలంగాణా నుంచి పార్టీని విత్‌డ్రా చేసుకోవడం కరెక్టేనని భావిస్తున్నారు.
తెలంగాణలో నివసిస్తున్న చంద్రబాబు వ్యతిరేకులు కేసీఆర్ అభిమానులుగా మారారు. ఇదంతా నాణానికి ఒకవైపున మనకు కనిపిస్తున్న దృశ్యం.
నాణానికి రెండో వైపు ఏమిటంటే చంద్రబాబు కేసీఆర్‌కు దాసోహం అయ్యాక కేసీఆర్ శ్రీకృష్ణుడి లెవెల్లో చంద్రబాబుకు రాజకీయ హితబోధ చేశాడని, దాంతో అలనాడు అర్జునుడికి విశ్వరూప సందర్శనం అయినట్టు చంద్రబాబుకు భవిష్యత్తు చిత్రపటం కళ్లముందు కనిపించిందని అంటున్నారు.
ఇంతకూ కేసీఆర్ చంద్రబాబుకు చెప్పిందేంటంటే తెలంగాణ ప్రజలకు కమ్మవారిమీద విపరీతమైన ద్వేషం ఉంది. నువ్వు నీ సామాజిక వర్గంతో ఇక్కడ రాజకీయాలు చెయ్యాలంటే కుదరదు, కుదరనివ్వను. నువ్వు నీ ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమైపో! నేను నీ రాష్ట్రంలో జోక్యం చేసుకోను. నువ్వు నా రాష్ట్రంలో జోక్యం చేసుకోవద్దు. పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధాని అని మకాం వెయ్యకుండా తక్షణం మూటా ముల్లే సర్ధుకుని విజయవాడకు వెళ్ళిపో!
అంటూ అసలు రహస్యం చెప్పాడంటారు. ఇక్కడ నాకు భవిష్యత్తులో బలమైన శత్రువర్గం రెడ్లు. అక్కడ నీకు శత్రువర్గం రెడ్లు. కాబట్టి అక్కడ రెడ్లు అధికారంలోకి వస్తే ఇక్కడా నాకు ఇబ్బంది కలిగిస్తారు. ఇక్కడ రెడ్లకు ప్రోత్సాహం ఇస్తారు. కాబట్టి మనం ఒకరిపై ఒకరు యుద్ధం చేయడం మాని ఇద్దరం రెడ్లపై యుద్ధం చేద్దాం అని హితబోధ చేశాడట. దాంతో కలిగిన జ్ఞానోదయంతోనే ఇప్పుడు చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో అక్కడ రెడ్లను చీలుస్తున్నాడు. ఇక్కడ కమ్మవాళ్లతో కేసీఆర్ యుద్ధం పూర్తయింది కాబట్టి ఇక కాంగ్రెస్‌లోని రెడ్ల మీద దృష్టిపెట్టి ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు చేస్తున్న పనిని వీలైనంత త్వరలో కేసీఆర్ ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉంది. అత్యుత్తమ ప్రేక్షకుడిగా జగన్ కుటుంబ సభ్యులతో బాల్కనీలో కూర్చుని ఈ సినిమాను చూస్తూ ఆనందించే అవకాశమూ ఉంది.
Click on image to read: