Telugu Global
Cinema & Entertainment

జనతా గ్యారేజికి కొరటాల రెమ్యునరేషన్ ఎంత ?

ప్ర‌తిభ వుంటే ఎప్ప‌టికైనా గుర్తింపు వ‌స్తుంది. దానితో పాటే ల‌క్ష్మీ దేవి కూడా వ‌స్తుంది. ర‌చ‌యిత‌గా వున్న‌ప్పుడు కొర‌టాల శివ అంటే ఇండ‌స్ట్రీ పీపుల్ కు మాత్ర‌మే తెలుసు. ఆయ‌న ఇచ్చిన క‌థ‌లు చాలా వ‌ర‌కు విజ‌యం సాధించిన‌వి అంటారు. అయితే ఆయ‌న ద‌ర్శ‌కుడు కావ‌డానికి ఒక కారణం ఆయ‌న క‌థ‌లు తీసుకున్న డైరెక్ట‌ర్స్ ఆయ‌న పేరు ను సినిమా టైటిల్స్ లో ఇవ్వ‌కుండా వుండ‌టం అని టాలీవుడ్ లో ఒక టాక్. దీంతో ఆయ‌నే మిర్చి […]

జనతా గ్యారేజికి కొరటాల రెమ్యునరేషన్ ఎంత ?
X

ప్ర‌తిభ వుంటే ఎప్ప‌టికైనా గుర్తింపు వ‌స్తుంది. దానితో పాటే ల‌క్ష్మీ దేవి కూడా వ‌స్తుంది. ర‌చ‌యిత‌గా వున్న‌ప్పుడు కొర‌టాల శివ అంటే ఇండ‌స్ట్రీ పీపుల్ కు మాత్ర‌మే తెలుసు. ఆయ‌న ఇచ్చిన క‌థ‌లు చాలా వ‌ర‌కు విజ‌యం సాధించిన‌వి అంటారు. అయితే ఆయ‌న ద‌ర్శ‌కుడు కావ‌డానికి ఒక కారణం ఆయ‌న క‌థ‌లు తీసుకున్న డైరెక్ట‌ర్స్ ఆయ‌న పేరు ను సినిమా టైటిల్స్ లో ఇవ్వ‌కుండా వుండ‌టం అని టాలీవుడ్ లో ఒక టాక్. దీంతో ఆయ‌నే మిర్చి చిత్ర క‌థ‌తో ద‌ర్శ‌కుడి అవ‌తారం ఎత్తారు. ప్ర‌భాస్ తో చేసిన ఆ క‌థ ఎంత సంచ‌ల‌న హిట్ సాధించిందో తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా మెగాఫోన్ ప‌ట్టిన ఫ‌స్ట్ ఫిల్మ్ కే కొర‌టాల 50 ల‌క్ష‌ల రెమ్యున రేష‌న్ తీసుకున్నాడంటే న‌మ్మ‌డం క‌ష్టం. సాధార‌ణంగా డెబ్యూ అంటే ఫ్రీ గా చేయమంటారు ప్రొడ్యూస‌ర్స్ . ఎందుకంటే అవ‌కాశం ఇవ్వ‌డ‌మే గొప్ప విష‌యం అనేది ఒక వెర్ష‌న్.

క‌ట్ చేస్తే శ్రీ‌మంతుడు సినిమాకు కొర‌టాల శివ 4 కోట్లు రెమ్యున రేష‌న్ తీసుకున్నాడ‌న్న గాని ఎవ‌రు న‌మ్మ‌రు. కానీ అది నిజం అంటారు ఆయ‌న స‌న్నిహితులు. తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ తో చేస్తున్న జ‌న‌తా గ్యారేజ్ సినిమాకు ద‌ర్శ‌కుడు కొర‌టాల ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..? అక్ష‌రాల 10 కోట్లట‌. వాస్త‌వంగా నిర్మాత‌లు 8 కోట్లు ఇవ్వ‌డానికి ఫిక్స్ అయ్యార‌ట‌. ఆయితే ఎన్టీఆర్ ద‌గ్గ‌రుండి మ‌రి..ఆయన రేంజ్ 8 కోట్లు ..10 కోట్లు అని చెప్పి ఇప్పిస్తున్నార‌ట‌. త‌నతో చిత్రాలు చేసే ద‌ర్శ‌కుల‌కు ఎన్టీఆర్ నిర్మాత‌ల నుంచి మంచి రెమ్యునరేష‌న్ ఇప్పిస్తాడ‌నే టాక్ వున్న విష‌యం తెలిసిందే. మొత్తం మీద కొర‌టాల శివ రెమ్యున రేష‌న్ ఒక రికార్డే అనే చెప్పాలి మ‌రి.

First Published:  23 Feb 2016 12:53 AM IST
Next Story