అత్యాచార బాధితురాలి అబార్షన్‌కు హైకోర్టు అనుమతి!
అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన అమ్మాయికి, తన 24 వారాల గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగించుకునే అనుమతినిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రంలోని జునాగధ్ జిల్లాకు చెందిన 18 సంవత్సరాల యువతి విషయంలో హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే రేపిస్ట్‌ని గుర్తించేందుకు డిఎన్ఎ టెస్టు చేసేందుకు వీలుగా బాధితురాలి కడుపులోని పిండం తాలూకూ కణజాల భాగాన్ని, కేసుని విచారిస్తున్న అధికారులకు అప్పగించాల్సిందిగా జస్టిస్ సోనియా గోకానీ ఆదేశించారు. బాధితురాలి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తి ఈ […]
అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన అమ్మాయికి, తన 24 వారాల గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగించుకునే అనుమతినిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రంలోని జునాగధ్ జిల్లాకు చెందిన 18 సంవత్సరాల యువతి విషయంలో హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే రేపిస్ట్‌ని గుర్తించేందుకు డిఎన్ఎ టెస్టు చేసేందుకు వీలుగా బాధితురాలి కడుపులోని పిండం తాలూకూ కణజాల భాగాన్ని, కేసుని విచారిస్తున్న అధికారులకు అప్పగించాల్సిందిగా జస్టిస్ సోనియా గోకానీ ఆదేశించారు.
బాధితురాలి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. తన బాయ్‌ప్రెండ్ చేత అత్యాచారానికి గురయిన బాధితురాలు, అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. నిందితుడి తరపువారి నుండి బెదిరింపులు ఎదుర్కొంది. మానసికంగా చిత్రవధను అనుభవిస్తూ ప్రాణాలు తీసుకోవాలని గత సెప్టెంబరులో యాసిడ్ తాగింది. దాంట్లోంచి బయటపడిన ఆమె చివరికి, తనకు అబార్షన్‌కు అనుమతి కావాలంటూ హైకోర్టుని ఆశ్రయించింది. కూలిపనులు చేసుకునే తన తల్లిదండ్రులకూ, తనకూ ఆ బిడ్డ భారం అవుతుందని ఆమె కోర్టుకి చెప్పుకుంది.
మెడికల్ టెర్మినేషన్ ఆప్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం, గర్భం దాల్చి 20 వారాలు దాటితే అబార్షన్ చేయకూడదు. ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో హైకోర్టు అనుమతిని ఇవ్వలేదు. అయితే ఇంతకుముందు సుప్రీం కోర్టు 14 సంవత్సరాల అత్యాచార బాధితురాలి విషయంలో ఇలాంటి తీర్పుని ఇచ్చింది.
సుప్రీం కోర్టు తీర్పుని ఉదాహరణగా చూపుతూ తీర్చునిచ్చిన జస్టిస్ గోకానీ, బాధితురాలికి అబార్షన్ చేయించే వీలు ఉందో లేదో పరీక్షించాలని సోలా సివిల్ ఆసుపత్రిని కోరారు. బాధితురాలు శారీరకంగా అబార్షన్‌ని తట్టుకునేలా లేకపోయినా, అబార్షన్ చేయకపోతే ఆమె మానసికంగా మరింతగా గాయపడే ప్రమాదముంది కనుక అబార్షన్‌కి అనుమతి ఇస్తున్నట్టుగా కోర్టు తీర్పులో పేర్కొన్నారు. అబార్షన్ అయిన వెంటనే ఆమె ఆరోగ్యం గురించి తెలిపే రిపోర్టు తనకు అందించాలని కోర్టు ఆదేశించింది.
ఈ బాధితురాలి గురించి తెలుసుకున్నాక ఎవరికైనా…. అత్యాచార నేరస్తులను జైలుకి పంపడం కంటే ముందు…బాధితురాలితోనే ఉంచి, ఆమె ఎదుర్కొనే బాధలు, గుండెకోత, మనో శరీరాలకు గాయాలై విలపించే తీరు…వీటన్నింటినీ కళ్లారా చూపించాలి…అనిపించకమానదు.