తెలంగాణ చింతమనేనితో జాగ్రత్త సార్!
ఏపీలో ఇటీవల బాగా వివాదాస్పదమైన వ్యక్తి చింతమేనని ప్రభాకర్. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అడ్డొచ్చిన వారినళ్లా కొట్టడం, తిట్టడం ఆయన హాబీ. తహసీల్దార్ వనజాక్షిని ఇసుకలో పడేసి కొట్టడం, అంగన్ వాడీలను బూతులు తిట్టడం, అక్రమ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఫారెస్ట్ సిబ్బందిని కొట్టడం ఇలా చెబుతూపోతే ఈ రెండేళ్లలోనే ఆయన చేసిన ఘనకార్యాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు అచ్చం ఇలాంటి వ్యక్తే తెలంగాణలోనూ తయారయ్యారు. ఈయన కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేనే. పేరు […]
ఏపీలో ఇటీవల బాగా వివాదాస్పదమైన వ్యక్తి చింతమేనని ప్రభాకర్. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అడ్డొచ్చిన వారినళ్లా కొట్టడం, తిట్టడం ఆయన హాబీ. తహసీల్దార్ వనజాక్షిని ఇసుకలో పడేసి కొట్టడం, అంగన్ వాడీలను బూతులు తిట్టడం, అక్రమ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఫారెస్ట్ సిబ్బందిని కొట్టడం ఇలా చెబుతూపోతే ఈ రెండేళ్లలోనే ఆయన చేసిన ఘనకార్యాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు అచ్చం ఇలాంటి వ్యక్తే తెలంగాణలోనూ తయారయ్యారు. ఈయన కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేనే. పేరు గువ్వల బాలరాజు. ఎదుటివారిపై తిట్టడం, కొట్టడమే దూకుడు ఉండడమే రాజకీయం అన్నది ఈయన సిద్ధాంతం .
ఎమ్మెల్యే పదవి అంటే అదో కింగ్ పోస్టు అన్నట్టు.. అధికారులు, ప్రతిపక్షనేతలు తన ముందు పురుగులు అన్నట్టుగా ఉంటోంది ఈయన తీరు. రెండు రోజుల క్రితం అచ్చంపేట ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌ను తన అనుచరులకు ఇచ్చేందుకు నిరాకరించాలడంటూ ఏకంగా ఫారెస్ట్ రేంజర్ రామేశ్వర్‌రెడ్డిపైనే దాడి చేశారు. అనుచరులతో కొట్టించారు. దీంతో మండిన ఫారెస్ట్ సిబ్బంది రోడ్డెక్కారు. ఎమ్మెల్యే, అతడి అనుచరులను అరెస్ట్ చేయాలని లేకుంటే సామూహిక సెలవు పెట్టి వెళ్తామని హెచ్చరించారు. చివరకు కేటీఆర్ మధ్యవర్తిత్వం చేసి ఉద్యోగులను శాంతపరిచారు. రాజీ కుదుర్చడం మంచిదే కానీ … కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ మరో విషయం ఆలోచించుకోవాల్సి ఉంది.
ఇలాంటి నేతలను వెనుకేసుకురావడం ద్వారా చింతమనేనిని ప్రోత్సహిస్తూ చంద్రబాబు ఎదుర్కొంటున్నట్టుగానే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనిషన్నాక తప్పు చేయడం సహజం . కానీ ఒకసారికే వర్తిస్తుంది. బాలరాజు ఇలా చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశంలోనే నేరుగా చెంపదెబ్బకొట్టారు. ఒక ఎమ్మెల్యేను మరో ఎమ్మెల్యే చెంపదెబ్బకొట్టిన ఘటన చరిత్రలో ఉండకపోవచ్చు. అప్పుడే బాలరాజును మందలించి ఉంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారిపై దాడికి తెగించేవారు కాదు. కానీ ఎమ్మెల్యేను కొట్టిన బాలరాజును కేసీఆర్ తన వెంట విదేశీ పర్యటనకు తీసుకెళ్లారు. అలా చేయడం వల్ల తన హీరోయిజానికి కేసీఆర్ ఆమోదం ఉందన్న భావన బాలరాజులో కలిగి ఉంటుంది. అందుకే ఇప్పుడు అధికారిపై దాడి చేయగలిగారు. ఇప్పుడు కూడా మందలించడం మానేసి రాజీ ప్రయత్నాలు చేస్తే బాలరాజుకు చింతమనేని తేడా ఉండదు… అలాగే చంద్రబాబుకు కేసీఆర్‌కు కూడా తేడా ఉండదు.
Click on image to read: