లోకేష్ చక్రాలను గుర్తించిందే వారు కదా!
కన్నకొడుకును ఎవరైనా పొగుడుతుంటే వచ్చే ఆ కిక్కే వేరబ్బ… అదే ఎవరైనా తిడుతుంటే మాత్రం తండ్రిగా కోపం రావడం కూడా సహజం. ప్రస్తుతం చంద్రబాబు కూడా ఇలాంటి పుత్రసంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. లోకేష్ గ్రేట్ అని పత్రికల్లో వస్తే ఉప్పొంగిపోతున్నారు. అదే లోకేష్ బ్యాడ్ బాయ్ అని ఏ పత్రికైనా రాస్తే రగలిపోతున్నారు. తన కుమారుడు లోకేష్ గురించి కొన్ని మీడియా సంస్థలు కావాలని నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నాయని మండిపడుతున్నారు. అయితే బాబు ఆవేదనలో అర్థముందా?. ప్రాజెక్టుల అంచనా […]
కన్నకొడుకును ఎవరైనా పొగుడుతుంటే వచ్చే ఆ కిక్కే వేరబ్బ… అదే ఎవరైనా తిడుతుంటే మాత్రం తండ్రిగా కోపం రావడం కూడా సహజం. ప్రస్తుతం చంద్రబాబు కూడా ఇలాంటి పుత్రసంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. లోకేష్ గ్రేట్ అని పత్రికల్లో వస్తే ఉప్పొంగిపోతున్నారు. అదే లోకేష్ బ్యాడ్ బాయ్ అని ఏ పత్రికైనా రాస్తే రగలిపోతున్నారు. తన కుమారుడు లోకేష్ గురించి కొన్ని మీడియా సంస్థలు కావాలని నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నాయని మండిపడుతున్నారు. అయితే బాబు ఆవేదనలో అర్థముందా?.
ప్రాజెక్టుల అంచనా వ్యయాల పెంపు, ఇతర అవినీతి కార్యక్రమాలను లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఒక వర్గం మీడియా ఇటీవల వరుస కథనాలు రాసింది. అందుకే బాబుకు కోపమొచ్చింది. తన పని తాను చేసుకుపోతున్న తన కుమారుడిపై ఎందుకు ఇలాంటి కథనాలు రాస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సదరు మీడియా సంస్థను మూసేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ లోకేష్ తనపని తాను చేసుకోవడం లేదని, పరోకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడని, మంత్రి వర్గ సమావేశాలు జరిపి క్లాసులు పీకుతున్నాడని జనమెరిగిన సత్యం. అందుకు టీడీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా సాక్ష్యమే.
ఆ మధ్య కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ దీక్ష చేసిన సమయంలో కాపు కార్పొరేషన్‌కు నిధుల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ ఏడాదికి గాను వంద కోట్లు కేటాయించాలని ప్రభుత్వం భావించిందట. కానీ లోకేష్ జోక్యం చేసుకోవడంతో ఆ మొత్తాన్ని రూ.500 కోట్లుకు పెంచారని టీడీపీకి సన్నిహితంగా పనిచేసే పత్రికే పెద్దగా కథనాన్ని రాసింది. లోకేష్ రంగంలోకి దిగి కాపులకోసం మరో నాలుగువందల కోట్ల నిధులు మంజూరయ్యేలా ప్రభుత్వాన్ని ఒప్పించాడని రాశారు. మరి అప్పుడు ఆ కథనాన్ని చంద్రబాబు ఖండించలేదే!. ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేని లోకేష్ చెబితే రూ. వంద కోట్లను రూ. 500 కోట్లకు ఎలా పెంచుతామని చంద్రబాబు అనలేదే!. అంటే ఆ కథనం లోకేష్‌కు మంచి చేసిది కాబట్టి మౌనంగా ఉన్నారా!.
చంద్రబాబు విదేశాలకు వెళ్లినప్పుడు మంత్రులను పిలిపించుకుని ఎలాంటి అర్హత లేని లోకేష్ సమీక్షలు నిర్వహించింది నిజం కాదా?. ఆ విషయం కూడా సొంత మీడియాలో వచ్చింది కదా?. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొచ్చే విషయంలో లోకేష్ చక్రం తిప్పుతున్నారని నిత్యం బాబు మీడియానే గొప్పలు రాస్తోంది కదా!. ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడీపీ అనుబంధ సంస్థ కార్మిక పరిషత్ గెలుపుకోసం లోకేష్ చక్రం తిప్పారని, మాలమహానాడు నేత కారెం శివాజీతో చర్చలు జరిగి కొన్ని వర్గాలు టీడీపీ అనుబంధ సంస్థకు మద్దతు తెలిపేలా చేయగలిగారని ఇష్టమైన మీడియాలోనే కథనాలు వచ్చిన మాట నిజం కాదా?. ఆ ఎన్నికల్లో కార్మిక పరిషత్ మేజారిటీ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. అదే వేరే విషయం.
ఇలా లోకేష్ వరుస పెట్టి చక్రాలు తిప్పుతున్నారని అనుకూల మీడియాలో కథనాలు వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు పుత్రోత్సహంతో మురిసిపోతున్నారు. లోకేష్ అవినీతి చేస్తున్నారంటూ కథనాలు రాస్తే మాత్రం కస్సుమంటున్నారు. తండ్రి అధికారంలో ఉంటే కొడుకులు తెరవెనుక చక్రం తిప్పడం ఎవరి విషయంలోనైనా నేరమే. అయినా జనంలోకి వస్తే ఏమైనా అంటాం అని శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారుగా!.
Click on image to read: