గుండెపోటుని గుర్తించడంలో పొరబాట్లు!
చిన్నవయసు మహిళల్లో గుండెపోటు లక్షణాలను గుర్తించడంలో వైద్యులు కొన్ని సందర్భాల్లో పొరబడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. తల నొప్పి, మగతగా ఉండటం అనే లక్షణాలతో 45 సంవత్సరాల లోపు మహిళలు ఆసుపత్రికి వస్తే వైద్యులు, ఆ లక్షణాలను గుండె అనారోగ్యానికి సంబంధించినవిగా భావించడం లేదని, పెద్దవయసున్నవారిలో కనిపించే లక్షణాల కోసం చూస్తున్నారని, అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్‌యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో న్యూరాలజీ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ డేవిడ్ న్యూమాన్ టోకర్ అంటున్నారు. మామూలుగానే మహిళల్లో గుండెపోటు లక్షణాలను గుర్తించడంలో వైద్యులు పొరబడుతున్నారని, దాదాపు […]
చిన్నవయసు మహిళల్లో గుండెపోటు లక్షణాలను గుర్తించడంలో వైద్యులు కొన్ని సందర్భాల్లో పొరబడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. తల నొప్పి, మగతగా ఉండటం అనే లక్షణాలతో 45 సంవత్సరాల లోపు మహిళలు ఆసుపత్రికి వస్తే వైద్యులు, ఆ లక్షణాలను గుండె అనారోగ్యానికి సంబంధించినవిగా భావించడం లేదని, పెద్దవయసున్నవారిలో కనిపించే లక్షణాల కోసం చూస్తున్నారని, అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్‌యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో న్యూరాలజీ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ డేవిడ్ న్యూమాన్ టోకర్ అంటున్నారు. మామూలుగానే మహిళల్లో గుండెపోటు లక్షణాలను గుర్తించడంలో వైద్యులు పొరబడుతున్నారని, దాదాపు 30శాతం మందిని అంతా బాగానే ఉందంటూ ఇంటికి పంపేస్తుంటారని, ఇక మహిళల వయసు 45 సంవత్సరాల లోపు ఉంటే మరింతగా పొరబాటు పడుతున్నారని, వారు తలనొప్పిగా ఉందని చెబితే చెవి ఇన్‌ఫెక్షన్ లేదా మైగ్రేన్ నొప్పిగా భావిస్తున్నారని టోకర్ అంటున్నారు.
ఒబేసిటీ కారణంగా చిన్నవయసు మహిళల్లోనూ గుండెపోటు వచ్చే ప్రమాదావకాశాలు పెరుగుతున్నాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్నది. మెడలోని రక్తనాళాల్లో గాయమైనా గుండెపోటుకి గురవుతున్నారని ఈ సంస్థ వైద్యులు అంటున్నారు. పెద్ద యాక్సిడెంటు ద్వారా అయినా, చిన్నపాటి సంఘటనతో అయినా ఇలా జరగవచ్చని వారు చెబుతున్నారు. అలాగే హార్మోన్ సంబంధింత మెడిసిన్ ద్వారా కుటుంబ నియంత్రణ పాటించినవారిలోనూ చిన్నవయసులో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందట. వీరిలో తలనొప్పులు, బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్లతో ఈ ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నా వైద్యులు సకాలంలో గుర్తించడం లేదని పేర్కొన్నారు. అందుకే తలనొప్పి, మగత, ఎక్కిళ్లు, తలతిరగటం లాంటి సమస్యలు ఉన్నప్పుడు అవి గుండెపోటు లక్షణాలు కాదని వైద్యులచేత నిర్దారించుకోవాలని డాక్టర్ న్యూమ్యాన్ టోకర్ చెబుతున్నారు.