Telugu Global
Cinema & Entertainment

ఈ ఊపిరికి ఓ ప్రత్యేకత ఉంది

ఊపిరి అనే టైటిల్ ను ప్రకటించక ముందు నుంచే ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగార్జున-కార్తి మల్టీస్టారర్ కాంబినేషన్ సమ్ థింగ్ స్పెషల్ అనుకుంటే…. మన్మధుడు నాగ్ ను వీల్ చైర్ లో కూర్చోబెట్టడం మరో సాహసం. నేటివిటీకి దూరంగా ఉండే ఓ కథను మన మనసులకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ ప్రయత్నంలో అతడు తొలి విజయాన్ని సాధించాడనే చెప్పాలి. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో అందరి ప్రశంసలు […]

ఈ ఊపిరికి ఓ ప్రత్యేకత ఉంది
X

ఊపిరి అనే టైటిల్ ను ప్రకటించక ముందు నుంచే ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగార్జున-కార్తి మల్టీస్టారర్ కాంబినేషన్ సమ్ థింగ్ స్పెషల్ అనుకుంటే…. మన్మధుడు నాగ్ ను వీల్ చైర్ లో కూర్చోబెట్టడం మరో సాహసం. నేటివిటీకి దూరంగా ఉండే ఓ కథను మన మనసులకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ ప్రయత్నంలో అతడు తొలి విజయాన్ని సాధించాడనే చెప్పాలి. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో అందరి ప్రశంసలు అందుకున్న ఈ దర్శకుడు… తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ తో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. వచ్చేనెల 25న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి శనివారం టీజర్ విడుదల చేశారు. నాగార్జున, కార్తి, తమన్న కనిపించిన ఈ టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా గోపీసుందర్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇదే ఊపులో ఈనెల 28న ఆడియోను విడుదల చేసి… థియేట్రికల్ ట్రయిలర్ ను కూడా లాంఛ్ చేయాలని చూస్తున్నారు. ఇంగ్లిష్ లో హిట్టయిన ఇన్ టచబుల్స్ అనే సినిమా ఆధారంగా తెరకెక్కిన ఊపిరి… తెలుగులో ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

ఆ రీమేక్ రజనీ చేయట్లేదు

Rajinikanth

చార్మి కోరికల చిట్టా…

Charmi-Kaur

విజ‌య్ తేరి ఫిల్మ్ కు ఫ్యాన్సి ప్రైస్‌..!

Theri-Vijay

బాహుబలిని బ్రేక్ చేసిన ఎన్టీఆర్

Prabhas-NTR

3 వారాల్లో…. 3 పాటలు… పవన్ నయా టార్గెట్

Pawan-Kalyan-Sardar-Gabbar-

క్లాసిక్స్ ను ఖూనీ చేస్తున్న కోన

Kona-Venkat

ర‌జ‌నీకాంత్ నెక్ట్స్ ఫిల్మ్ శివ‌లింగా…?

rajinikanth-333

First Published:  21 Feb 2016 3:19 AM IST
Next Story