మీడియాకు వైసీపీ ఎమ్మెల్యేల చివాట్లు
కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ టీవీ చానళ్లు ప్రచారం చేయడంతో సదరు ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వారు మీడియా తీరును తప్పుపట్టారు . కనీసం తమ వివరణ కూడా తీసుకోకుండా ఇష్టానుసారం తమ పేర్లను ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ చెప్పినట్టుగా ఆడడం మీడియాకు సరికాదన్నారు. చానళ్లు ఏదో ఒక లక్కీ నెంబర్ అనేసుకుని అంత మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతున్నారని.. ఇంత మంది ఎమ్మెల్యేలు […]
కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ టీవీ చానళ్లు ప్రచారం చేయడంతో సదరు ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వారు మీడియా తీరును తప్పుపట్టారు . కనీసం తమ వివరణ కూడా తీసుకోకుండా ఇష్టానుసారం తమ పేర్లను ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ చెప్పినట్టుగా ఆడడం మీడియాకు సరికాదన్నారు. చానళ్లు ఏదో ఒక లక్కీ నెంబర్ అనేసుకుని అంత మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతున్నారని.. ఇంత మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతున్నారని ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. స్వార్థపరులు పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదని జగన్ అన్నట్టుగా తప్పుడు వార్తలను స్క్రోలింగ్‌లు నడపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ చెప్పినట్టుగా ఆడటం టీవీ చానళ్లు మానుకోవాలని సూచించారు. మీడియా అంటే గౌరవం ఉందని దాన్ని నిలుపుకోవాలని కోరారు.
చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగంగానే పార్టీ మారుతున్నట్టు తమపై ప్రచారం చేస్తున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. మునిగిపోయే పడవలోకి ఎవరు వెళ్తారని ప్రశ్నించారు. టీడీపీ పెట్టే ఆశలకు లొంగే రకం తాముకాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే అక్కడ కొనసాగలేక సతమతమవుతున్నారని మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ మారుతున్నట్టు భూమా నాగిరెడ్డి చెప్పలేదని… ఆయన స్పందించే వరకు ఎదురుచూడాలని కోరారు. భూమాకు వైసీపీ నాయకత్వం చాలా గౌరవం ఇచ్చిందన్నారు. పీఏసీ పదవి కూడా భూమాకే ఇచ్చిన విషయాన్ని మోహన్ రెడ్డి గుర్తు చేశారు.
తాము పార్టీ వీడడం లేదని ఎన్నిసార్లు చెప్పినా టీవీ చానళ్లు ఎందుకు పదేపదే తమ పేర్లతో కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మీడియాకు మంచిది కాదన్నారు. కనీసం వివరణ తీసుకోవాలన్న ఇది కూడా లేదా అని మీడియాను ప్రశ్నించారు. వైసీపీలో అభద్రతాభావం కలిగించేందుకు టీడీపీ ఆడుతున్న నాటకంలో మీడియా భాగస్వామి అవడం సరికాదన్నారు . హామీలను నెరవేర్చలేక సంక్షోభంలో కూరుకుపోయిన టీడీపీ పక్కపార్టీ వాళ్లకు వలేస్తోందని విమర్శించారు.
రెండేళ్లుగా రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు పార్టీలోకి కర్నూలు జిల్లా నుంచి ఏ ఒక్కరూ వెళ్లరని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. ఎప్పటికీ తాము జగన్‌తోనే ఉంటామన్నారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఎమ్మెల్యే ఐజయ్య, జయరాములు కూడా ఖండించారు.
Click on Image to Read