జీవితం మాది...జడ్జిమెంట్ మీది!
ఎవరెన్ని చెబుతున్నా, ఎన్ని మార్పులు వచ్చినా ఆడవారు కనిపించేతీరు, మేకప్, ప్రవర్తన, ఆలోచనలు… ఇలా అన్ని అంశాల్లో మగవారి ప్రభావం ఉంటూనే ఉంది. స్త్రీకి శరీరం ద్వారా మాత్రమే గుర్తింపు లభించే పరిస్థితులు పోనంతకాలం ఇది ఇలాగే ఉంటుంది. మగవారికి నచ్చేలా ఉండటం ఇప్పటికీ స్త్రీలకు తప్పనిసరి తద్దినంలాగే ఉంది. అలాగే సమాజమూ ఆడవారిపట్ల జడ్జిమెంటల్ ధోరణిలోనే ఉంది. పైగా ఇతరులు తమ గురించి విమర్శలు చేస్తే ఆడవాళ్లు చాలావరకు వాటిని లైట్‌గా తీసుకోలేరు. వాటిని స్వీయ విమర్శలుగానే భావిస్తారు. ఆత్మ విశ్వాసం కోల్పోతుంటారు. […]
ఎవరెన్ని చెబుతున్నా, ఎన్ని మార్పులు వచ్చినా ఆడవారు కనిపించేతీరు, మేకప్, ప్రవర్తన, ఆలోచనలు… ఇలా అన్ని అంశాల్లో మగవారి ప్రభావం ఉంటూనే ఉంది. స్త్రీకి శరీరం ద్వారా మాత్రమే గుర్తింపు లభించే పరిస్థితులు పోనంతకాలం ఇది ఇలాగే ఉంటుంది. మగవారికి నచ్చేలా ఉండటం ఇప్పటికీ స్త్రీలకు తప్పనిసరి తద్దినంలాగే ఉంది. అలాగే సమాజమూ ఆడవారిపట్ల జడ్జిమెంటల్ ధోరణిలోనే ఉంది. పైగా ఇతరులు తమ గురించి విమర్శలు చేస్తే ఆడవాళ్లు చాలావరకు వాటిని లైట్‌గా తీసుకోలేరు. వాటిని స్వీయ విమర్శలుగానే భావిస్తారు. ఆత్మ విశ్వాసం కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో మహిళలు ఎలా ఉంటే మీకిష్టం అనే విషయంపై అధ్యయనం నిర్వహించగా చాలామంది పురుషులు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. అలాగే ఇవే అంశాలపై మహిళలు కూడా స్పందించారు. ఆ విశేషాలు –
-ఇప్పటికీ, ఈ ఆధునిక కాలంలోనూ పురుషులు, సాంప్రదాయసిద్ధంగా ఉన్న మహిళల్లోనే, వాటిని ఆచరించేవారిలోనే సమర్ధత ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.
-పొడవాటి కురులు ఉన్న మహిళలు పిల్లలను చక్కగా పెంచగలరని తాము అనుకుంటున్నామని 62వాతం మంది మగవాళ్లు చెప్పారు.
-మహిళల సమర్థత కంటే వారు ఎలా కనబడుతున్నారు అనేదే ముఖ్యమని 68శాతం మగవారు అంగీకరించారు. మగవారే కాదు, ఈ విషయాన్ని మహిళలు సైతం ఒప్పుకుంటున్నారు. 65శాతం మంది మహిళలు తమ హెయిర్ స్టయిల్ అనేది ప్రపంచం తమకు ఇచ్చే గుర్తింపులో ఎక్కువ పాత్రని పోషిస్తున్నట్టుగా చెప్పారు. హెయిర్‌స్టయిల్ సరిగ్గా లేని రోజు తాము ఆత్మవిశ్వాసంతో ఉండలేమని వారు అన్నారు. అసలు ఆరోజు తమకు మంచి జరుగుతుందని కూడా ఆశించలేమని, మనస్ఫూర్తిగా పనిచేయలేమని చాలామంది భారతీయ మహిళలు చెప్పారు.
-తాము ఇంకా ఇతరుల అభిప్రాయాలు, నిర్ణయాలకు అనుగుణంగానే జీవించాల్సి వస్తోందని 70శాతం మంది మహిళలు చెప్పారు. ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచన, సందేహం ఇంకా తమని వెంటాడుతూనే ఉందని, మనసుని గాయపరుస్తూనే ఉందని వారు వెల్లడించారు. తాము ఎలా ఉండాలో నిర్దేశించేవారిలో, తమని విమర్శించేవారిలో ఎక్కువగా బంధువులు, స్నేహితులే ఉంటున్నారని వారు చెప్పారు. తమని ప్రేమించేవారు సైతం తమకు అండగా నిలబడని సందర్భాలే ఎక్కువని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు.
ఎసి నీల్సన్ అనే గ్లోబల్ మార్కెటింగ్ రీసెర్చి సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.