మనసు వేధించింది...జీవితం ముగిసింది!
సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కన్న ఆ విద్యార్థి, తానేం చదువుతున్నానో తెలియడం లేదంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మానసిక సమస్యలతో సతమతమవుతున్న అతను అందులోంచి బయటపడలేక చివరికి జీవితాన్నే వదిలేశాడు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజిలో డిగ్రి చివరి సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల వివేకానంద గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం వివేకానంద నల్గొండ జిల్లాకు చెందినవాడు. జీవితంలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలనే ఆశయంతో ఉన్నవాడు. కానీ మానసికంగా ఆరోగ్యంగా లేని వివేకానంద, తానేం చేస్తున్నాడో తనకు తెలియడం […]
సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కన్న ఆ విద్యార్థి, తానేం చదువుతున్నానో తెలియడం లేదంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మానసిక సమస్యలతో సతమతమవుతున్న అతను అందులోంచి బయటపడలేక చివరికి జీవితాన్నే వదిలేశాడు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజిలో డిగ్రి చివరి సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల వివేకానంద గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం వివేకానంద నల్గొండ జిల్లాకు చెందినవాడు. జీవితంలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలనే ఆశయంతో ఉన్నవాడు. కానీ మానసికంగా ఆరోగ్యంగా లేని వివేకానంద, తానేం చేస్తున్నాడో తనకు తెలియడం లేదని, జీవితాన్ని ముగిస్తున్నానని, తన చావుకి ఎవరూ బాధ్యులు కారని లేఖ రాసి హాస్టల్లోని బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని మరణించాడు. వివేకానంద బాగా చదివే విద్యార్థే అయినా కొన్ని సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, దానికి వైద్యం కూడా చేయించామని తల్లిదండ్రులు తెలిపారు. ఇంతకుముందు స్నేహితులతో కలిసి రూములో ఉండి చదువుకున్న వివేకానంద, సివిల్స్‌కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు కోచింగ్ తీసుకోవాలంటూ అశోక్ నగర్లోని హాస్టల్‌కు మారాడు.
తల్లిదండ్రులు, కొడుకు స్నేహితులతో కలిసి రూములో ఉంటేనే మంచిదని భావించినా, అతను అందుకు ఒప్పుకోలేదు. వివేకానంద అమెరికానుండి ఒక సంవత్సరం ఫెలోషిప్‌కి ఎంపికయ్యాడు. డిగ్రీ తరువాత అందులో చేరాల్సి ఉంది. అయితే దాని తాలూకూ ఇంటర్వ్యూని అతను పూర్తి చేయలేదు. ఒక ప్రొఫెసర్ ఈ విషయంలో ఎంతో సహాయం చేసినా అతనికున్న మానసిక సమస్యలు ముందడుగు వేయకుండా చేశాయని అతని తండ్రి తెలిపాడు. గురువారం నాడు ఎంతకీ ఫోను లిఫ్ట్ చేయకపోవడంతో అతని పాత రూమ్మేట్ రాహుల్‌ని వివేకానంద గురించి తెలుసుకోవాల్సిందిగా తండ్రి కోరాడు. రాహుల్ శుక్రవారం వెళ్లి చూసేసరికి అతను మృతి చెంది కనిపించాడని పోలీసులు వెల్లడించారు. వివేకానంద మీద తాము ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని, అతను ఏం చేస్తానన్నా ఒప్పుకున్నామని, అయినా చివరికి ఇలా అయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.