భూమా ఎపిసోడ్- సాక్షి మీడియా వైఖరి
భూమానాగిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని శుక్రవారం పెద్దెత్తున మీడియా చానళ్లలో ప్రచారం సాగింది. ఈ సమయంలో చాలా మంది చూపు సాక్షి మీడియాపై పడింది. టీడీపీకి అనుకూల చానళ్లు అధికంగా ఉండడంతో అవన్నీ భూమా చేరిక ఖాయమని గుక్కతిప్పుకోకుండా కథనాలు ప్రసారం చేశాయి. భూమా బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి తాను వైసీపీని వీడడం లేదని ప్రకటించినా దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ సమయంలో సాక్షిలో ఏమైనా కౌంటర్ గా కథనాలు వస్తున్నాయా అని […]
భూమానాగిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని శుక్రవారం పెద్దెత్తున మీడియా చానళ్లలో ప్రచారం సాగింది. ఈ సమయంలో చాలా మంది చూపు సాక్షి మీడియాపై పడింది. టీడీపీకి అనుకూల చానళ్లు అధికంగా ఉండడంతో అవన్నీ భూమా చేరిక ఖాయమని గుక్కతిప్పుకోకుండా కథనాలు ప్రసారం చేశాయి. భూమా బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి తాను వైసీపీని వీడడం లేదని ప్రకటించినా దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ సమయంలో సాక్షిలో ఏమైనా కౌంటర్ గా కథనాలు వస్తున్నాయా అని చాలా మంది చూశారు. కానీ భూమా ఎపిసోడ్‌లో సాక్షి చాలా ఆచితూచీ వ్యవహరించింది.
ఎస్వీమోహన్ రెడ్డి తాను పార్టీ వీడడం లేదని ప్రకటించినా సాక్షి టీవీ దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మీడియా కథనాలపై భూమా స్టేట్‌మెంట్‌ను కూడా కేవలం తూతూమంత్రంగానే స్క్రోలింగ్‌కు పరిమితమైంది. భూమా ఎపిసోడ్ పై మరి ఎక్కువగా స్పందించడం సరికాదన్న ఉద్దేశంతోనే సాక్షి ఇలా వ్యవహరించి ఉండవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.
సాక్షి పత్రికలో కూడా ఆసక్తికరంగా కథనం ప్రచురించారు. ”అవినీతి మురికిని దాచే తాపత్రయం – చంద్రబాబు సంతబేరం” అంటూ చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలకు గాలమేస్తున్నారని కథనాన్ని ప్రచురించింది. పైగా ఒక తీవ్రమైన కార్టూన్‌ను వేసింది. డబ్బు సంచులతో బురదలో పందులతో పాటు చంద్రబాబు నిల్చొని.. రండి బాబు రండి అంటూ పత్రిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్టుగా కార్టూన్ వేసింది. పరోక్షంగా టీడీపీలోకి వెళ్లడం అంటే పందులు దొర్లే బురదలోకి దిగడమేనని సాక్షి ఎత్తిచూపింది. అయితే ఈ కధనంలో ఎక్కడ కూడా భూమానాగిరెడ్డి పేరు ప్రచురించకుండా జాగ్రత్తపడింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడాన్ని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి సోదరులు వ్యతిరేకించారని మరో కథనాన్ని సాక్షి ప్రచురించింది. అయితే పార్టీ అవసరాల దృష్ట్యా తప్పదని లోకేష్ స్పష్టం చేశారని కథనం ప్రచురించారు.
శిల్పా చక్రపాణిరెడ్డి వ్యతిరేకిస్తున్నారని చెప్పడం ద్వారా టీడీపీలో అంతా సవ్యంగా లేదని ఎత్తిచూపింది. చివరకు సాక్షి జిల్లా ఎడిషన్‌లో కూడా భూమా అంశం గురించి ఒక్క లైన్ కూడా సాక్షి పత్రిక రాయలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలోకి వెళ్లడం లేదంటూ కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రకటన ప్రముఖంగా ప్రచురించారు. అయితే వైసీపి, సాక్షి మీడియా వైఖరి చూస్తుంటే ఎలాంటి పరిస్థితికైనా మానసికంగా సిద్ధపడినట్లు అర్ధమవుతుంది.
Click on Image to Read