Telugu Global
Cinema & Entertainment

క్లాసిక్స్ ను ఖూనీ చేస్తున్న కోన

గుండమ్మ కథ, పాతాళభైరవి, మాయాబజార్, దసరా బుల్లోడు, శంకరాభరణం, సాగర సంగమం…. ఈ సినిమాలన్నీ తెలుగు సినీచరిత్రలో నిలిచిపోయే ఆణిముత్యాలు. వీటిని మళ్లీ రీమేక్ చేసే సాహసాన్ని ఎవరూ చేయరు. కనీసం ఆ సినిమా పేర్లు కూడా వాడుకునే ధైర్యం చేయలేదు మొన్నటివరకు. కానీ కోన వెంకట్ మాత్రం ఇప్పుడు క్లాసిక్ సినిమాలపై విరుచుకుపడుతున్నాడు. అలనాటి ఆణిముత్యం కనిపిస్తే చాలు… తన సినిమాకు ఆ పేరు పెట్టేస్తున్నాడు. ఓవైపు విమర్శకులు ఈ చర్యను నిరసిస్తున్నప్పటికీ… కోన మాత్రం […]

క్లాసిక్స్ ను ఖూనీ చేస్తున్న కోన
X
గుండమ్మ కథ, పాతాళభైరవి, మాయాబజార్, దసరా బుల్లోడు, శంకరాభరణం, సాగర సంగమం…. ఈ సినిమాలన్నీ తెలుగు సినీచరిత్రలో నిలిచిపోయే ఆణిముత్యాలు. వీటిని మళ్లీ రీమేక్ చేసే సాహసాన్ని ఎవరూ చేయరు. కనీసం ఆ సినిమా పేర్లు కూడా వాడుకునే ధైర్యం చేయలేదు మొన్నటివరకు. కానీ కోన వెంకట్ మాత్రం ఇప్పుడు క్లాసిక్ సినిమాలపై విరుచుకుపడుతున్నాడు. అలనాటి ఆణిముత్యం కనిపిస్తే చాలు… తన సినిమాకు ఆ పేరు పెట్టేస్తున్నాడు. ఓవైపు విమర్శకులు ఈ చర్యను నిరసిస్తున్నప్పటికీ… కోన మాత్రం తన స్టయిల్ వీడలేదు. పాత సినిమా టైటిల్స్ ను ఇష్టారాజ్యాంగా వాడేస్తూనే ఉన్నాడు. గీతాంజలి టైటిల్ తో ఓ సినిమా తీసి హిట్ కొట్టిన కోన… ఆ మధ్య శంకరాభరణం టైటిల్ తో మరో సినిమా చేశాడు. సినిమాకు టైటిల్ కు అక్రమ సంబంధం కల్పించి మరీ టైటిల్ ను ఇరికించేశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఏకంగా ఈ రచయిత… పాతాళ భైరవి టైటిల్ పై కన్నేశాడు. తమన్న-ప్రభుదేవా జంటగా… తెలుగు-తమిళ-హిందీ భాషల్లో రాబోతున్న హారర్ సినిమాకు పాతాళ భైరవి అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Click on Image to Read:

rajinikanth-333

Prabhas-NTR

krishnashtami-movie-review

sarainodu

kejriwalSuraj-Pancholikrish-varun

Click on image for Nikki Garlrani latest Stills Nikki-Garlrani-FI-Y

First Published:  20 Feb 2016 4:51 AM IST
Next Story