Telugu Global
NEWS

మ‌న‌సులో మాట‌- భూమా రాక‌పై కేఈ అసంతృప్తి !

భూమానాగిరెడ్డి వ‌ర్గం టీడీపీలోకి వ‌స్తుంద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో క‌ర్నూలు జిల్లాకే చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. భూమా చేరిక‌పై త‌మ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం లేద‌న్నారు. అస‌లు రాయ‌ల‌సీమ రాజ‌కీయాల‌ను అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీమ‌లో ఎదుటి పార్టీ వారితో క‌నీసం తాము మాట్లాడే ప‌రిస్థితి కూడా ఉండద‌న్నారు. అలాంట‌ప్పుడు ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ఎలా ట‌చ్‌లో ఉంటార‌ని ప్ర‌శ్నించారు. రాయ‌ల‌సీమ రాజ‌కీయ వాతావ‌ర‌ణం పూర్తి భిన్నంగా ఉంటుంద‌న్నారు. […]

మ‌న‌సులో మాట‌- భూమా రాక‌పై కేఈ అసంతృప్తి !
X

భూమానాగిరెడ్డి వ‌ర్గం టీడీపీలోకి వ‌స్తుంద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో క‌ర్నూలు జిల్లాకే చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. భూమా చేరిక‌పై త‌మ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం లేద‌న్నారు. అస‌లు రాయ‌ల‌సీమ రాజ‌కీయాల‌ను అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

సీమ‌లో ఎదుటి పార్టీ వారితో క‌నీసం తాము మాట్లాడే ప‌రిస్థితి కూడా ఉండద‌న్నారు. అలాంట‌ప్పుడు ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ఎలా ట‌చ్‌లో ఉంటార‌ని ప్ర‌శ్నించారు. రాయ‌ల‌సీమ రాజ‌కీయ వాతావ‌ర‌ణం పూర్తి భిన్నంగా ఉంటుంద‌న్నారు. భూమా పార్టీలోకి వ‌స్తార‌న్న ప్ర‌చారాన్ని తాము కూడా మీడియాలోనే చూస్తున్నామ‌న్నారు. ప‌క్క జిల్లాల నుంచి వైసీపీ నేత‌లెవ‌రైనా వ‌స్తున్నారా అన్న ప్ర‌శ్న‌కు … సొంత జిల్లాలో ఏం జ‌రుగుతోందో కూడా తెలియ‌డం లేదు, ఇక ప‌క్క జిల్లాల సంగ‌తులు ఎలా తెలుస్తాయ‌ని ప్ర‌శ్నించారు.

గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించ‌డంతో తాము కూడా కౌంట‌ర్‌గా కొన్ని వ్యాఖ్య‌లు చేశామ‌న్నారు. అంతేగానీ వైసీపీ నేత‌లు టీడీపీలోకి వ‌స్తున్నట్టుగా త‌మ‌కు స‌మాచారం లేద‌ని తేల్చేశారు కేఈ. జగన్ తొందరపాటు వల్లే ఈ ప్రచారం మొదలైందన్నారు.

టీడీపీ బ‌లోపేతం కోసం భూమాను అధినాయ‌క‌త్వం పార్టీలోకి తెస్తోంద‌న్న వాద‌న‌పైనా ఆయ‌న స్పందించారు. ప్ర‌స్తుతం జిల్లాలో టీడీపీ బ‌లంగానే ఉంద‌న్నారు. బ‌లంగా ఉండ‌బ‌ట్టే జెడ్పీ స్థానంతో పాటు ఎమ్మెల్సీని కూడా గెలిపించుకోగ‌లిగామ‌ని అన్నారు. భూమా నాగిరెడ్డి చేరిక‌పై త‌మ అభిప్రాయాల‌ను చంద్ర‌బాబుకే వివ‌రిస్తామ‌న్నారు.

కేఈ మాట‌లు బ‌ట్టి కొన్ని విష‌యాలు అర్థ‌మ‌వుతున్నాయి. పార్టీ జిల్లాలో బ‌లంగా ఉంద‌న‌డం ద్వారా భూమా రావ‌డం వ‌ల్ల కొత్త‌గా బ‌ల‌ప‌డేదేమీ లేద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్టు అయింది. రాయ‌ల‌సీమ రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని అర్థం చేసుకోవాల‌ని కోర‌డం ద్వారా భూమాను పార్టీలోకి తెస్తే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రించిన‌ట్టు అయింది.

Click on Image to Read

bhuma-nagi-reddy

2bd159d6-8c6a-4b0e-93f1-7540517de4d4

sakshi-bhuma

lokesh-nara

payyavula-keshav

sv-mohan-reddy

krishnashtami-movie-review

kodali-nani

chandrababu-elefad

First Published:  20 Feb 2016 9:45 AM IST
Next Story