కొత్త కోణమా? కుట్ర కోణమా?
ఎన్నైనా చెప్పండి. పందిని నందిని చేయాలంటే టీడీపీ అనుకూల మీడియా తర్వాతే ఎవరైనా!. తాజాగా చంద్రబాబు అత్యంత నమ్మకమైన ఒక మీడియా సంస్థ కొత్త కోణమంటూ ఒక కథను అల్లేసింది. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడంలో చంద్రబాబు తప్పేమీ లేదు అంతా జగన్ చేసుకున్న పాపమే అని రాసింది. అసలు చంద్రబాబు తెలంగాణ తరహాలో కాకుండా ఏపీలో నిజాయితీగా రాజకీయం చేయాలనుకున్నారట. కానీ ఎప్పుడైతే జగన్ ప్రభుత్వాన్ని పడగొడుతానని ప్రకటించిన తర్వాతే బాబుకు కోపం వచ్చి వైసీపీ […]
ఎన్నైనా చెప్పండి. పందిని నందిని చేయాలంటే టీడీపీ అనుకూల మీడియా తర్వాతే ఎవరైనా!. తాజాగా చంద్రబాబు అత్యంత నమ్మకమైన ఒక మీడియా సంస్థ కొత్త కోణమంటూ ఒక కథను అల్లేసింది. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడంలో చంద్రబాబు తప్పేమీ లేదు అంతా జగన్ చేసుకున్న పాపమే అని రాసింది. అసలు చంద్రబాబు తెలంగాణ తరహాలో కాకుండా ఏపీలో నిజాయితీగా రాజకీయం చేయాలనుకున్నారట. కానీ ఎప్పుడైతే జగన్ ప్రభుత్వాన్ని పడగొడుతానని ప్రకటించిన తర్వాతే బాబుకు కోపం వచ్చి వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకునేందుకు సిద్ధమయ్యారని కొత్తకోణం కేక. అయితే ఇక్కడ కొత్త కోణం ఆవిష్కరించే ప్రయత్నంలో పాత కోణం ఒకటి మరిచిపోయింది సదరు మీడియా. అదేంటంటే!.
సరే సదరు మీడియా చెప్పినట్టు చంద్రబాబు నిజాయితీగానే బతకాలని అనుకున్నారని కాసేపు అనుకుందాం. జగన్ రెచ్చగొట్టిన తర్వాతే వైసీపీ ఎమ్మెల్యేలను లాగేయాలని అనుకున్నారని అనుకుందాం. మరీ ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవక ముందే … కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయకముందే వైసీపీ ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతను ఎలా టీడీపీలోకి చేర్చుకున్నారు?. అప్పుడు జగన్ రెచ్చగొట్టలేదు కదా!. అప్పుడు రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలన్న విషయం బాబు మరిచిపోయారు.
ఇప్పటికీ కనీసం ఆ ఇద్దరు ఎంపీల చేత రాజీనామా కూడా చేయించకుండా వెంటేసుకుని తిరుగుతున్నారే ఇదేం నిజాయితీ రాజకీయం?!. ఎంపీలను చేర్చుకునే విషయంలో నిజాయితీ అన్న పదాన్నిబాబు మరిచారా… లేక … సిగ్గుమాలిన ఫిరాయింపులకు కూడా పవిత్రత ఆపాదించే ప్రయత్నంలో బాబు అనుకూల మీడియా కావాలనే మరిచిందా! . పైగా వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని విజయవాడ కేబినెట్ భేటీలో మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసిన తర్వాతే జగన్ స్పందించారు. దాన్ని కూడా దాచిపెట్టారు. మొత్తం మీద బాబు చేసే అనైతిక ఫిరాయింపులను కూడా నిజాయితీలో చూపించే ప్రయత్నం బాగానే చేస్తోంది సదరు మీడియా. సో… వినేవాడు వెర్రివాడైతే చెప్పేది చంద్రబాబు మీడియా అన్న సామెతను విరివిగా వాడుకోవచ్చు.