కేజ్రీవాల్ అండ్ టీమ్ ముందే చూసేశారు..!
రాజకీయ నాయకులకు సినిమాలు చూసే తీరిక ఉండడం అరుదే. ఇక ఢిల్లీ లాంటి దేశ రాజధానికి సీయం అంటే చెప్పనవసరం లేదు. కానీ.. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా విజయ కేతనం ఎగుర వేసి.. ఢిల్లీ సీయం పీఠం ఎక్కిన కేజ్రీవాల్ కొంత సమయం చూసుకుని నీర్జా చిత్రం చూశారు. బాలీవుడ్ దర్శకుడు రామ్ మధ్వానీ డైరెక్ట్ చేసిన నిర్జా చిత్రం శక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే ఇంతకి ఈ నీర్జా ఎవరు.? అంతగా […]
రాజకీయ నాయకులకు సినిమాలు చూసే తీరిక ఉండడం అరుదే. ఇక ఢిల్లీ లాంటి దేశ రాజధానికి సీయం అంటే చెప్పనవసరం లేదు. కానీ.. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా విజయ కేతనం ఎగుర వేసి.. ఢిల్లీ సీయం పీఠం ఎక్కిన కేజ్రీవాల్ కొంత సమయం చూసుకుని నీర్జా చిత్రం చూశారు. బాలీవుడ్ దర్శకుడు రామ్ మధ్వానీ డైరెక్ట్ చేసిన నిర్జా చిత్రం శక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
అయితే ఇంతకి ఈ నీర్జా ఎవరు.? అంతగా రాజకీయనాయకులు చూడాల్సిన పాయింట్ ఏముంది.? ఇదొక బయోపిక్. ఒక సాధారణ ఎయిర్ హెస్టెస్ జీవితం ఆధారంగా చేసిన చిత్రం. అయితే చూడాల్సిన పాయింట్ ఏముంది ..? 1973 లో కరాచి లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను తీవ్ర వాదులు హైజాక్ చేశారు. ఆ ఫ్లైట్ లో ఎయిర్ హెస్టెస్ గా నీర్జా ఉన్నారు. తన ప్రయాణికుల్ని కాపాడుకోవడానికి నీర్జా (రియల్ నేమ్ నీర్జా భనోట్) ఎలా పోరాడింది అనేదే నీర్జా చిత్ర కథాంశం. ఎయిర్ హుస్టెస్ నీర్జా రోల్ ను సోనమ్ కపూర్ పోషించింది. సీనియర్ నటి టబు ఈ సినిమాలో ఒక కీ రోల్ పోషించింది. ఇది బ్రీఫ్ గా కేజ్రీవాల్ అండ్ టీమ్ చూసిన సినిమా విశేషాలు మరి.
Click on Image to Read