జీలకర్ర మన జీవగర్ర
పోపుల పెట్టెలో అందుబాటులో ఇంతమంచి ఔషధం ఉందా అనిపిస్తుంది జీలకర్ర గురించి తెలుసుకుంటే. ఇది మనకు ఎన్ని రకాలుగా మేలుచేస్తుందో చూడండి- జీలకర్రని తగిన మోతాదులో రోజూ తీసుకుంటే శరీర బరువు తగ్గడంలో దోహదపడుతుంది. ఎందుకంటే ఇందులో కొవ్వుని, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలున్నాయి. రాత్రి నీళ్లలో రెండుస్పూన్ల జీలకర్రని వేసి నాననిచ్చి, తెల్లారి ఆ నీటి కాచి జీలకర్రతో సహా తాగాలి. పెరుగుతో పాటు జీలకర్ర పొడిని తీసుకున్నా ఫలితం ఉంటుంది. అలాగే జీలకర్ర, అరటి […]
పోపుల పెట్టెలో అందుబాటులో ఇంతమంచి ఔషధం ఉందా అనిపిస్తుంది జీలకర్ర గురించి తెలుసుకుంటే. ఇది మనకు ఎన్ని రకాలుగా మేలుచేస్తుందో చూడండి-
- జీలకర్రని తగిన మోతాదులో రోజూ తీసుకుంటే శరీర బరువు తగ్గడంలో దోహదపడుతుంది. ఎందుకంటే ఇందులో కొవ్వుని, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలున్నాయి. రాత్రి నీళ్లలో రెండుస్పూన్ల జీలకర్రని వేసి నాననిచ్చి, తెల్లారి ఆ నీటి కాచి జీలకర్రతో సహా తాగాలి. పెరుగుతో పాటు జీలకర్ర పొడిని తీసుకున్నా ఫలితం ఉంటుంది. అలాగే జీలకర్ర, అరటి పండు కాంబినేషన్ కూడా బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది.
- జీలకర్రని తేనె కలిపిన నీటితో లేదా కూరగాయల సూప్‌తో కూడా కలిపి తీసుకోవచ్చు.
- అరుగుదల సమస్యలున్నవారు ప్రతిరోజూ జీరా టీ తాగితే మేలు. ఒక గ్లాసు నీటిలో జీలకర్రని వేసి మరిగించి, మూతపెట్టి చల్లారాక తాగాలి. లేదా వేడినీటిలో జీలకర్రని వేసి చల్లారాక తాగవచ్చు. ఈ టీని రోజుకి మూడుసార్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే చిన్నపాటి కడుపు నొప్పులు తగ్గుతాయి.
- ఇది యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తుంది. పొత్తి కడుపులో కొవ్వుని తగ్గిస్తుంది. మెటబాలిజం రేటుని పెంచుతుంది. అలా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
- క్యాన్సర్ రీసెర్చి లేబరేటరీ ఆఫ్ హిల్టన్ హెడ్ ఐలాండ్, దక్షిణ కరొలినా, అమెరికా వారు నిర్వహించిన అధ్యయనాల్లో జీలకర్ర క్యాన్సర్‌తో పోరాడుతుందని తేలింది. దీనికి ట్యూమర్ల పెరుగుదలను నిరోధించే శక్తి ఉంది.
- ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంది. ఇది కణాల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడం, రక్తపోటు, హదయ స్పందన రేటుని సరిగ్గా ఉంచడం లాంటి పనులను సైతం చేస్తుంది. గుండె వ్యాధులు ఉన్నవారు జీలకర్రని వాడుతుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
- వాపులు, శ్వాసలో ఇబ్బందులను తగ్గిస్తుంది. జాయింట్ ఇన్‌ఫెక్షన్లు, అంబిలికల్ హెర్నియా, పేగుల వ్యాధులు, కంటి, పంటి సమస్యలు…వీటన్నింటికీ జీలకర్ర మంచి మందుగా పనిచేస్తుంది.
- శరీరంలో వేడి, దురదలాంటి సమస్యలు ఉంటే- కొంత జీలకర్రని వేడి నీటిలో వేసి, చల్లారాక ఆ నీటితో స్నానం చేయాలి.
జీలకర్రలో స్వతసిద్దంగా ఉన్న ఔషధ గుణాలు ఇవి. సాధారణ ప్రయోజనాల కోసం దీన్ని వినియోగించవచ్చు. అయితే ప్రత్యేకంగా అనారోగ్యాలకు విరుగుడుగా వాడదలచుకుంటే మాత్రం ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.