జంపింగ్‌పై స్పందించిన భూమా
వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై భూమానాగిరెడ్డి స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలను ప్రతిసారి తాను ఖండించలేనని చెప్పారు. పత్రికల్లో రోజూ ఏదో ఒకటి రాస్తున్నారని వాటన్నింటిని ఖండిస్తూ ఉండలేనన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. కుట్రపూరితంగానే తనపై ప్రచారం జరుగుతోందన్నారు. కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజు నుంచే తనపై పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం మొదలుపెట్టారని అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన భూమానాగిరెడ్డితో పాటు ఆయన కూతురు భూమా అఖిలప్రియ, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో […]

వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై భూమానాగిరెడ్డి స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలను ప్రతిసారి తాను ఖండించలేనని చెప్పారు. పత్రికల్లో రోజూ ఏదో ఒకటి రాస్తున్నారని వాటన్నింటిని ఖండిస్తూ ఉండలేనన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. కుట్రపూరితంగానే తనపై ప్రచారం జరుగుతోందన్నారు. కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజు నుంచే తనపై పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం మొదలుపెట్టారని అన్నారు.
కర్నూలు జిల్లాకు చెందిన భూమానాగిరెడ్డితో పాటు ఆయన కూతురు భూమా అఖిలప్రియ, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని మీడియా వరుసపెట్టి కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో భూమానాగిరెడ్డి స్పందించారు. అనంతరం నంద్యాల నుంచి హైదరాబాద్ కు భూమా బయలుదేరారు.