భవిష్యత్తుపై గ్యారెంటీ ఇవ్వని రామసుబ్బారెడ్డి
వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి విలీనం చేసుకునే ప్రక్రియ చూయింగ్ గమ్‌లా సాగుతూనే ఉంది. ” నేను వచ్చేస్తా ఒక్కసారి పిలవండి” అని ఆదినారాయణరెడ్డి మోహమాటం విడిచిపెట్టి విజ్ఞప్తి చేసినా టీడీపీ నుంచి సరైన స్పందన లేదు. అదే సమయంలో జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వ్యవహారం టీడీపీకి కంగారు పుట్టిస్తోంది. తాజాగా గురువారం జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడిన రామసుబ్బారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. అదే సమయంలో భవిష్యత్తు పరిణామాలను బట్టి కార్యకర్తలతో […]
వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి విలీనం చేసుకునే ప్రక్రియ చూయింగ్ గమ్‌లా సాగుతూనే ఉంది. ” నేను వచ్చేస్తా ఒక్కసారి పిలవండి” అని ఆదినారాయణరెడ్డి మోహమాటం విడిచిపెట్టి విజ్ఞప్తి చేసినా టీడీపీ నుంచి సరైన స్పందన లేదు. అదే సమయంలో జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వ్యవహారం టీడీపీకి కంగారు పుట్టిస్తోంది. తాజాగా గురువారం జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడిన రామసుబ్బారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. అదే సమయంలో భవిష్యత్తు పరిణామాలను బట్టి కార్యకర్తలతో చర్చించి పార్టీ మారే అంశంపై నిర్ణయం తీసుకుంటానన్నారు. తాను ఆదినారాయణరెడ్డిని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
నాలుగు రోజుల క్రితం విజయవాడలో చంద్రబాబును రామసుబ్బారెడ్డి కలిశారు. ఆదినారాయణరెడ్డి రాకను వ్యతిరేకించవద్దని చంద్రబాబు బుజ్జగించారు. మంచి నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని… రామసుబ్బారెడ్డి కూడా మెత్తబడ్డారని వార్తలొచ్చాయి. అయితే ఇంతలోనే ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వస్తే… పార్టీ మారే అంశంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రామసుబ్బారెడ్డి చెప్పడం చర్చనీయాంశంమైంది.
Click on Image to Read: