Telugu Global
Health & Life Style

టివి కాదు... మ‌న‌మే ఇడియ‌ట్స్‌!

టివికి ఇడియ‌ట్ బాక్స‌నే పేరుంది క‌దా. ఎక్కువ స‌మ‌యం దానిముందు గ‌డిపితే వ‌చ్చే న‌ష్టాలు తెలుసుకుంటే దానికి ఆ పేరు సరిగ్గా స‌రిపోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. అయితే కోరి కోరి ఆ న‌ష్టాల‌ను తెచ్చుకుంటాం క‌నుక మ‌నం అంత‌కంటే పెద్ద ఇడియ‌ట్స్‌మి అని కూడా అనిపిస్తుంది. బ్రిటీష్ జ‌ర్న‌ల్ ఆఫ్ స్పోర్ట్ మెడిసిన్, 11వేల‌మంది ఆస్ట్రేలియ‌న్ల మీద అధ్య‌య‌నం చేసి ఈ విష‌యంపై కొన్ని నిజాల‌ను వెల్ల‌డించింది. అవే ఇవి- పెద్ద‌వాళ్లు తాము టివి చూస్తున్న ప్ర‌తి గంట […]

టివి కాదు... మ‌న‌మే ఇడియ‌ట్స్‌!
X

టివికి ఇడియ‌ట్ బాక్స‌నే పేరుంది క‌దా. ఎక్కువ స‌మ‌యం దానిముందు గ‌డిపితే వ‌చ్చే న‌ష్టాలు తెలుసుకుంటే దానికి ఆ పేరు సరిగ్గా స‌రిపోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. అయితే కోరి కోరి ఆ న‌ష్టాల‌ను తెచ్చుకుంటాం క‌నుక మ‌నం అంత‌కంటే పెద్ద ఇడియ‌ట్స్‌మి అని కూడా అనిపిస్తుంది. బ్రిటీష్ జ‌ర్న‌ల్ ఆఫ్ స్పోర్ట్ మెడిసిన్, 11వేల‌మంది ఆస్ట్రేలియ‌న్ల మీద అధ్య‌య‌నం చేసి ఈ విష‌యంపై కొన్ని నిజాల‌ను వెల్ల‌డించింది. అవే ఇవి-

  • పెద్ద‌వాళ్లు తాము టివి చూస్తున్న ప్ర‌తి గంట కాలానికి, త‌మ అంచ‌నా జీవిత‌కాలంలోంచి 22 నిముషాల‌ను కోల్పోతున్న‌ట్టేన‌ట‌.
  • రోజంత‌టిలో ఆరుగంట‌లు టివి ముందు గ‌డిపేవారు, టివి చూడ‌ని త‌మ తోటివారికంటే ఐదేళ్లు ముందుగా జీవితాన్ని ముగించే ప్ర‌మాదం ఉంద‌ట‌.
  • అయితే ఈ ప్ర‌మాద‌మంతా కేవ‌లం టివి చూడ‌టం వ‌ల‌న వ‌చ్చేది కాదు, ఏ ప‌నీలేకుండా, శ‌రీరంలో చురుకుద‌నం లేకుండా స్థ‌బ్దుగా ఉండ‌టం వ‌ల‌న జ‌రిగే న‌ష్ట‌మ‌ది.
  • క‌ద‌ల‌కుండా ముప్ప‌యి నిముషాలు కూర్చుంటే ఆ త‌రువాత నుండి మ‌న శ‌రీరం, క‌ణాల్లో షుగ‌ర్‌ని నింప‌డం మొద‌లుపెడుతుంద‌ట‌. దీనివ‌ల‌న ఓవ‌ర్ వెయిట్‌తో పాటు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి.
  • టివి ముందయినా, ప‌నిచేస్తున్న డెస్క్ ముంద‌యినా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చునేవారు గుర్తుపెట్టుకుని, ప్ర‌తి అర‌గంట‌కు ఒక‌సారి లేచి కాస్త‌దూర‌మైనా న‌డ‌వాలని ఈ అధ్య‌య‌న నిర్వాహ‌కులు చెబుతున్నారు.
First Published:  18 Feb 2016 12:29 PM IST
Next Story