పులివెందుల్లో పట్టునిలుపుకున్న వైసీపీ- పనిచేయని లోకేష్ మంత్రాంగం?
ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో పోరు హోరాహోరీగా సాగింది. ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ తీవ్రస్థాయిలో తలబడ్డాయి. అయితే తుది ఫలితం మాత్రం తేలలేదు. రాష్ట్ర స్థాయి గుర్తింపు విభాగంలో ఎన్ఎంయూ 173 ఓట్ల ఆధిక్యం సాధించింది. అయితే వెయ్యికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండడంతో అవి కీలకం కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ను ఈనెల 24న లెక్కిస్తారు. అప్పటి వరకు తుది ఫలితం కోసం ఎదురు చూడాల్సిందే. టీడీపీ అనుబంధ కార్మిక పరిషత్, వైసీపీ అనుబంధ […]
ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో పోరు హోరాహోరీగా సాగింది. ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ తీవ్రస్థాయిలో తలబడ్డాయి. అయితే తుది ఫలితం మాత్రం తేలలేదు. రాష్ట్ర స్థాయి గుర్తింపు విభాగంలో ఎన్ఎంయూ 173 ఓట్ల ఆధిక్యం సాధించింది. అయితే వెయ్యికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండడంతో అవి కీలకం కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ను ఈనెల 24న లెక్కిస్తారు. అప్పటి వరకు తుది ఫలితం కోసం ఎదురు చూడాల్సిందే. టీడీపీ అనుబంధ కార్మిక పరిషత్, వైసీపీ అనుబంధ యూనియన వైఎస్ఆర్‌టీయూసీలు గుర్తింపు ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయాయి. అయితే… ఈ రెండు సంఘాలు బరిలో నిలిచి, ప్రధాన సంఘాలకు స్పష్టమైన ఆధిక్యం లేకుండా చేశాయి.
పులివెందుల డిపోలో మాత్రం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ విజయం సాధించింది. 43 ఓట్ల తేడాతో ఎంప్లాయిస్ యూనియన్‌పై వైసీపీ కార్మిక సంఘం విజయం సాధించింది. టీడీపీ అనుబంధం సంస్థ కార్మిక పరిషత్ అడ్రస్ లేకుండా పోయింది. లోకేష్ రంగంలోకి దిగి మంతనాలు జరిపినా ఉపయోగం లేకపోయింది. మాలమహానాడు నాయకుడు కారెం శివాజీ కార్మిక పరిషత్‌కు ఎస్సీఎస్టీ కార్మికులు ఓటేయాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. లోకేష్ కార్మిక సంఘాలతో మంత్రాంగం నడిపిన విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా ప్రముఖంగా ప్రచారం చేసింది. అయినా ఉపయోగం లేకపోయింది. విజయవాడలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కారెం శివాజీ, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు కలిశారు. ఫలితాల తీరును చూస్తుంటే రాజకీయ పార్టీలకు అతీతంగా కార్మికులు ఓటేసినట్టు స్పష్టమవుతోంది.
Click on Image to Read: