క్రిష్, వరుణ్‌తేజ్ ప్రాజెక్టు వెనక్కు!
వరుణ్‌తేజ్ మరొకసారి క్రిష్ దర్శకత్వంలో నటించనున్నాడనేది పాతవార్తే. అయితే ఆ ప్రాజెక్టు రాయబారి, పోస్ట్‌ఫోన్ అయినట్టుగా సమాచారం. క్రిష్ చేతిలోకి నందమూరి బాలకృష్ణ వందో చిత్రం అవకాశం వచ్చిచేరడంతో ఈ వాయిదా తప్పనిసరి అయ్యింది. అలాగే రాయబారి చిత్రీకరణకు ఆయా దేశాలనుండి అనుమతులు తీసుకునేందుకు కూడా సమయం పడుతున్ననేపథ్యంలో క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ లోపల ఖాళీగా ఉండకుండా వరుణ్‌తేజ్, గోపీచంద్ మలినేని చిత్రానికి ఒకే చెప్పాడు. అయితే ఈ అవకాశం మొదట సాయిధరమ్ తేజ్ […]

వరుణ్‌తేజ్ మరొకసారి క్రిష్ దర్శకత్వంలో నటించనున్నాడనేది పాతవార్తే. అయితే ఆ ప్రాజెక్టు రాయబారి, పోస్ట్‌ఫోన్ అయినట్టుగా సమాచారం. క్రిష్ చేతిలోకి నందమూరి బాలకృష్ణ వందో చిత్రం అవకాశం వచ్చిచేరడంతో ఈ వాయిదా తప్పనిసరి అయ్యింది. అలాగే రాయబారి చిత్రీకరణకు ఆయా దేశాలనుండి అనుమతులు తీసుకునేందుకు కూడా సమయం పడుతున్ననేపథ్యంలో క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ లోపల ఖాళీగా ఉండకుండా వరుణ్‌తేజ్, గోపీచంద్ మలినేని చిత్రానికి ఒకే చెప్పాడు. అయితే ఈ అవకాశం మొదట సాయిధరమ్ తేజ్ వద్దకు వెళ్లింది. అతని చేతిలో చాలా చిత్రాలు ఉండటంతో డేట్లు అడ్జస్టు చేయలేకపోయాడు. అలా ఆ చిత్రం మెగా కాంపౌండ్‌ని దాటకుండా మరొక హీరో వద్దకు వెళ్లింది. గోపీచంద్ ఈ సినిమా షూటింగ్‌ని త్వరలో ప్రారంభించనున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.