Telugu Global
Cinema & Entertainment

జ‌న‌తా గ్యారేజి@ మూడుకోట్లు!

పెద్ద హీరోల సినిమాలన‌గానే విదేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌టం స‌ర్వ‌సాధార‌ణ విష‌యం. లేక‌పోతే స్వ‌దేశంలో  స్టూడియోల్లో అయినా భారీ సెట్లు వేస్తారు. రాజీ ప‌డే ప్ర‌స‌క్తి మాత్రం ఉండ‌దు. సినిమా రిచ్‌గా క‌నిపించాల్సిందే. అలాగే స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డాల్సిందే.  పెద్ద పెద్ద భ‌వ‌నాలైనా, చిన్న గుడిసెలైనా అచ్చంగా అస‌లైన‌వే అనిపించాలి.  ఈ భారీ సెట్టింగులకు ఖ‌ర్చుకూడా భారీగానే ఉంటుంది మ‌రి. ఇదే క్ర‌మంలో పాడైపోయిన కార్ల‌ను రిపేర్ చేసే గ్యారేజి సెట్టుకోసం రికార్డుస్థాయిలో ఖ‌ర్చుపెట్టారు నిర్మాత‌లు. ఎన్టీఆర్ తాజాచిత్రం జ‌న‌తా […]

జ‌న‌తా గ్యారేజి@ మూడుకోట్లు!
X

పెద్ద హీరోల సినిమాలన‌గానే విదేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌టం స‌ర్వ‌సాధార‌ణ విష‌యం. లేక‌పోతే స్వ‌దేశంలో స్టూడియోల్లో అయినా భారీ సెట్లు వేస్తారు. రాజీ ప‌డే ప్ర‌స‌క్తి మాత్రం ఉండ‌దు. సినిమా రిచ్‌గా క‌నిపించాల్సిందే. అలాగే స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డాల్సిందే. పెద్ద పెద్ద భ‌వ‌నాలైనా, చిన్న గుడిసెలైనా అచ్చంగా అస‌లైన‌వే అనిపించాలి. ఈ భారీ సెట్టింగులకు ఖ‌ర్చుకూడా భారీగానే ఉంటుంది మ‌రి. ఇదే క్ర‌మంలో పాడైపోయిన కార్ల‌ను రిపేర్ చేసే గ్యారేజి సెట్టుకోసం రికార్డుస్థాయిలో ఖ‌ర్చుపెట్టారు నిర్మాత‌లు.

ఎన్టీఆర్ తాజాచిత్రం జ‌న‌తా గ్యారేజి కోసం సార‌ధి స్టూడియోలో భారీ సెట్‌ని వేశారు. ఇందుకోసం నిర్మాత‌లు మూడుకోట్లు ఖ‌ర్చుపెట్టారు. ఆర్ట్ డైర‌క్ట‌ర్ ఎఎస్ ప్ర‌కాష్ ఈ సెట్ రూప‌క‌ల్ప‌న‌కు సార‌ధ్యం వ‌హించాడు. గ్యారేజి ఒరిజిన‌ల్ లుక్ కోసం 20వ‌ర‌కు పాత కార్ల‌ను కొన్నార‌ట‌. మిర్చి, శ్రీమంతుడు సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఈ నెల 22 నుండి దీని షూటింగ్ మొద‌ల‌వుతుంది. స‌మంత‌, నిత్యామీన‌న్ హీరోయిన్లు. నాన్న‌కు ప్రేమ‌తో విజ‌యం త‌రువాత తార‌క్, శ్రీమంతుడు విజ‌యం త‌రువాత కొర‌టాల శివ క‌లిసి ప‌నిచేస్తున్న‌చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌లయాళ న‌టుడు మోహ‌న్‌లాల్ ఒక ప్ర‌ముఖ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

First Published:  17 Feb 2016 9:08 AM IST
Next Story