కేశవరెడ్డిపై ప్రభుత్వ కొరడా- ఆది అడ్డుకోలేకపోయారా?
కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝులిపించింది.. కొద్దికాలంగా కేశవరెడ్డిపై చర్యల విషయంలో నెమ్మదించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ చర్యలు మొదలుపెట్టింది. స్కూల్ యాజమాన్యానికి చెందిన ఆస్తులను అటాచ్ చేయాల్సిందిగా సీఐడీకి ఏపీ హోంశాఖ ఆదేశించింది. అటాచ్ చేయబోయే ఆస్తుల విలువ రూ. 24. 50 కోట్లు. ఒక్కసారి డిపాజిట్ కడితే ఉచితంగా విద్యనందిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కేశవరెడ్డి డబ్బులు వసూలు చేశారు. కోర్సు పూర్తయిన తర్వాత డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లిస్తామని […]
కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝులిపించింది.. కొద్దికాలంగా కేశవరెడ్డిపై చర్యల విషయంలో నెమ్మదించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ చర్యలు మొదలుపెట్టింది. స్కూల్ యాజమాన్యానికి చెందిన ఆస్తులను అటాచ్ చేయాల్సిందిగా సీఐడీకి ఏపీ హోంశాఖ ఆదేశించింది. అటాచ్ చేయబోయే ఆస్తుల విలువ రూ. 24. 50 కోట్లు. ఒక్కసారి డిపాజిట్ కడితే ఉచితంగా విద్యనందిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కేశవరెడ్డి డబ్బులు వసూలు చేశారు. కోర్సు పూర్తయిన తర్వాత డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే అలా చేయలేక కేశవరెడ్డి చేతులెత్తేశారు. దీంతో ఆయన అరెస్ట్ అయ్యారు.
కేశవరెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి వియంకుడవుతారు. కేశవరెడ్డిని కేసు నుంచి బయట పడేసేందుకే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. త్వరలోనే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ … కేశవరెడ్డి ఆస్తుల అటాచ్‌కు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. సంస్థ ఆస్తులు అమ్మడం ద్వారా డిపాజిట్లు చెల్లించే పనిలో కేశవరెడ్డి ఉండగానే ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులే ఆ ప్రయత్నాలు ముందుకు సాగకుండా అడ్డుపడ్డారని అప్పట్లో ప్రచారం జరిగింది. కేశవరెడ్డి విద్యాసంస్థల ఆస్తులను తక్కువ ధరకే కొట్టేసే ఉద్దేశంతోనే ఇలా చేశారన్న భావన ఉంది. కేశవరెడ్డిని దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన వారు కూడా విద్యాసంస్థలు నడుపుతున్న వారేనని చెబుతుంటారు.
Click on Image to Read: