షోలే హీరోయిన్ కొత్త బిజినెస్..!
షోలే. ఈపేరు వింటే కొన్ని కోట్ల సినిమా జనాల హృదయాలు పులకిస్తాయి. బాలీవుడ్ సినిమా గతిని ..స్థితిని మార్చిన కమర్షియల్ క్లాసిక్. అమితాబ్, ధర్మేంద్ర, హేమా మాలిని.సంజయ్ కపూర్, అంజాద్ ఖాన్, జయబచ్చన్ వంటి నటీ నటుల సినిమా జీవితాల్ని మార్చి వేసిన చిత్రం. దర్శకుడు రమేష్ సిప్పి పేరు ను బాలీవుడ్ తెర పై శాశ్వతంగా చేసిన ఈ చిత్రం వచ్చి ఇప్పటికి 40 ఏళ్లు గడిచింది. 40 ఏళ్ల తరువాత […]
BY admin17 Feb 2016 12:03 PM IST
X
admin Updated On: 17 Feb 2016 12:19 PM IST
షోలే. ఈపేరు వింటే కొన్ని కోట్ల సినిమా జనాల హృదయాలు పులకిస్తాయి. బాలీవుడ్ సినిమా గతిని ..స్థితిని మార్చిన కమర్షియల్ క్లాసిక్. అమితాబ్, ధర్మేంద్ర, హేమా మాలిని.సంజయ్ కపూర్, అంజాద్ ఖాన్, జయబచ్చన్ వంటి నటీ నటుల సినిమా జీవితాల్ని మార్చి వేసిన చిత్రం. దర్శకుడు రమేష్ సిప్పి పేరు ను బాలీవుడ్ తెర పై శాశ్వతంగా చేసిన ఈ చిత్రం వచ్చి ఇప్పటికి 40 ఏళ్లు గడిచింది.
40 ఏళ్ల తరువాత షోల్ సినిమా టీమ్ అంతా ఒక చోట కలిసారు. అయితే ఈ టీమ్ లో సంజయ్ కపూర్, అంజాద్ ఖాన్ ఈ భూమ్మిద లేక పోవడం బాధకరమే. అయితే కాలం ఎవరి కోసం ఆగదు. కానీ సందర్భం వచ్చినప్పుడు వారి జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే వుంటాయి. ఇంతకి మ్యాటర్ ఏమిటంటే.. సీనియర్ నటి హేమమాలీని డ్రీమ్ గాళ్ పేరు తో ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. ఈ ఆల్బమ్ రిలీజ్ కు ఆమే తను నటించిన షోలే టీమ్ అందర్నీ ఒకే చోట కలిసే ప్రొగ్రామ్ చేశారు. ఆఫ్ కోర్స్.. హేమమాలీని.. ధర్మేంద్ర .. అమితాబ్ ఇంటికి దగ్గరలోనే వుంటారట. కానీ.. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం తక్కువేనట. అయితే ఈ ప్రొగ్రామ్ కోసం ఇలా షోలే టీమ్ అంతా కలవడం సంతోషంగా ను ..ఆశ్చర్యంగాను ఉందన్నారు అమితాబ్. ఇక హేమమాలిని మాట్లాడుతూ.. ‘కళలు, వినోదాలే నన్ను నడిపిస్తున్నాయి. అవి నాలో కలిసిపోయాయి. గతంలో నా గాన ప్రతిభను ఎప్పుడూ పరీక్షించుకోలేదని… ఇప్పుడు వినిపించేందుకు ఆత్రుతతో ఉన్నానని… గతంలోమాదిరిగానే ఈసారీ ఆదరిస్తారని భావిస్తున్నాను’ అని హేమమాలి అన్నారు. 1973లో కిశోర్ కుమార్ ను చూసి స్ఫూర్తి పొందిన హేమ అప్పటి నుంచి సంగీత ఆల్బమ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందట . ఎట్టకేలకు ఆమే డ్రీమ్ నిజం అయ్యింది మరి.
Next Story