ఆ చిన్నారి కళ్లముందే...హత్య, ఆత్మహత్య!
తొమ్మిదేళ్ల ఆ చిన్నారి చూస్తుండగానే తండ్రి తల్లిని హతమార్చాడు తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయిలో ఈ దారుణ సంఘటన జరిగింది. నితిన్ పడ్కర్, సురేఖ భార్యాభర్తలు, వీరికి సమీక్ష (9), యువరాజ్ (7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నితిన్ ఓ మోటార్ ట్రైనింగ్ స్కూల్లో డ్రైవింగ్ కోచ్‌గా పనిచేసేవాడు. 2007లో వివాహం చేసుకున్న వీరిద్దరూ తరువాత ముంబయిలోని పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌ల్లో అద్దెకు ఉంటుండేవారు. ఈ సోమవారం అర్థరాత్రి తరువాత నితిన్ ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. […]
తొమ్మిదేళ్ల ఆ చిన్నారి చూస్తుండగానే తండ్రి తల్లిని హతమార్చాడు తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయిలో ఈ దారుణ సంఘటన జరిగింది. నితిన్ పడ్కర్, సురేఖ భార్యాభర్తలు, వీరికి సమీక్ష (9), యువరాజ్ (7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నితిన్ ఓ మోటార్ ట్రైనింగ్ స్కూల్లో డ్రైవింగ్ కోచ్‌గా పనిచేసేవాడు. 2007లో వివాహం చేసుకున్న వీరిద్దరూ తరువాత ముంబయిలోని పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌ల్లో అద్దెకు ఉంటుండేవారు.
ఈ సోమవారం అర్థరాత్రి తరువాత నితిన్ ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. ఆ రోజు రాత్రి పదకొండు వరకు నితిన్ సోదరి ఉమ వాళ్లింట్లోనే ఉంది. ఆ రాత్రి సురేఖ, ఉమతోపాటు వాళ్లింటికి వస్తానని అడిగింది. కానీ నితిన్ అందుకు ఒప్పకోలేదు. ఉమ, పోట్లాడుకోకండి అని చెప్పి తన ఇంటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లాక పిల్లలు నిద్రపోతున్నారనే ఉద్దేశంతో నితిన్ ఈ దారుణాలకు పాల్పడ్డాడు. కానీ అప్పుడే నిద్రలేచిన సమీక్ష తండ్రి చేస్తున్నదంతా చూసింది.
అతను ఏమేం చేశాడో సమీక్ష తెల్లవారాక పోలీసులకు కళ్లకు కట్టినట్టుగా చెప్పింది. తండ్రి తన తల్లి గొంతుకోసి హత్యచేసి తానూ చున్నీతో ఉరివేసుకున్నాడని ఆ చిన్నారి వణుకుతూ చెప్పింది. తాను అంతా చూస్తూనే ఉన్నా, తండ్రి తనని కూడా చంపుతాడనే భయంతో తాను నిద్రని నటించానంది. నిద్రపోతున్నట్టుగా నటిస్తూనే అలాగే నిద్రపోయానని, తెల్లారి లేవగానే మేనత్త ఇంటికి పరిగెత్తుకువెళ్లి జరిగింది చెప్పానని సమీక్ష తెలిపింది. నితిన్ తాగొచ్చి సురేఖని కొడుతుండేవాడని, భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం అతనికి ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషాద ఉదంతంలో చివరికి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు.