మరో నాదెండ్ల కావాలని ఉందా?
కరవలేనప్పుడు కనీసం బుసకొట్టమన్నారట అప్పట్లో ఎవరో చెట్టు కింద సాధువు. జగన్ ఈ విషయాన్ని బాగానే ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు. టీడీపీతో టచ్‌లోకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తున్న వార్తల నేపథ్యంలో జగన్ బుసకొట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాదు… టీడీపీ ఎమ్మెల్యేలే మాతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. అయితే నిజాలు మాట్లాడుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌తో టచ్‌లో ఉండడం ప్రస్తుత పరిస్ధితిలో దాదాపు అ సాధ్యం. ఏ పాయింట్ మీద టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి వస్తారో మాత్రం జగన్ […]
కరవలేనప్పుడు కనీసం బుసకొట్టమన్నారట అప్పట్లో ఎవరో చెట్టు కింద సాధువు. జగన్ ఈ విషయాన్ని బాగానే ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు. టీడీపీతో టచ్‌లోకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తున్న వార్తల నేపథ్యంలో జగన్ బుసకొట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాదు… టీడీపీ ఎమ్మెల్యేలే మాతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. అయితే నిజాలు మాట్లాడుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌తో టచ్‌లో ఉండడం ప్రస్తుత పరిస్ధితిలో దాదాపు అ సాధ్యం. ఏ పాయింట్ మీద టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి వస్తారో మాత్రం జగన్ చెప్పడం లేదు. 21 మంది ఎమ్మెల్యేల టచ్‌లోకి వస్తే ప్రభుత్వాన్ని పడగొడుతానంటున్నారు జగన్. ఇక్కడే ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను జగన్ చాలా తక్కువ అంచనా వేసినట్టున్నారు. ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తే సరిపోతుందా. ప్రజాస్వామ్యం మరీ ఇంత సులువుగా కనిపిస్తోంది.
డబ్బుతో ఎమ్మెల్యేలను కొనేసి, ప్రభుత్వాన్ని కూల్చేసి ఎన్నికలకు వెళ్తారు సరే… జనం పిచ్చోళ్ల లెక్క ఓటేస్తారా. నడుస్తున్న ప్రభుత్వాన్ని చిన్నచిన్న కారణాలు చెప్పి కూల్చేసిన వారిని ప్రజలు అందలం ఎక్కించిన చరిత్ర దేశంలోనే లేదు. కాంగ్రెస్ వాళ్ల సాయంతో ఎన్టీఆర్‌ను గద్దెదించిన నాదెండ్లకు ఆ తర్వాతి ఎన్నికల్లో ఏం జరిగిందో జగన్ గుర్తించుకోవాలి. మరో నాదెండ్ల కాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం జగన్‌కు ఉంది.
టీడీపీ అధికారం ఇంకా మూడేళ్లు ఉంది. ఉన్నది బలమైన బాబు నాయకత్వం. ఈ టైమ్‌లో తెలివైన వాడెవరైనా అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తారా. కొందరు 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన వారి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. నిజంగా చంద్రబాబు తలచుకుంటే… వైసీపీ నుంచి ఓ పది మందిని లాగేయడం పెద్ద సంగతేమీ కాదు. కానీ చంద్రబాబు ఆ పనిచేయడం లేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు వస్తారని చెప్పడం కూడా రాజకీయ చదరంగంలో ఒక భాగం. ఇప్పుడు జగన్ ఏకంగా సవాల్ చేశారు కాబట్టి చంద్రబాబు అన్నంత పని చేసినా ఆశ్చర్యం లేదు.
BY — ఎస్ ఆర్ వీ ఆర్