టీడీపీకి కొత్త సెంటిమెంట్ భయం- మీడియాకు ముందస్తు వేడుకోలు
సాగినంత కాలం తనఅంతటి వాడు లేడందురు… సాగపోతే చతికిలపడిపోయి సాకులు వెతికేరు!. ఇప్పుడు టీటీడీపీ పరిస్థితి ఇలాగే ఉంది. తెలంగాణలో టీడీపీకి వరుస కష్టాలకు కారణం ”టీటీడీపీ” అన్న పదమేనట. తెలంగాణ టీడీపీ, టీటీడీపీ అని సంబోధిస్తే కష్టాలు తప్పవని కొందరు పండితులు సూచించారని చెబుతున్నారు. టీడీపీ ముందు తెలంగాణ పదం చేర్చడం మంచిది కాదని సూచించారట. గతంలో ఇలాగే టీడీపీ పేరుకు ముందు పదాలను చేర్చడం వల్లే అన్నతెలుగుదేశం, ఎన్టీఆర్‌టీడీపీలు పతనమయ్యాయని గుర్తు చేస్తున్నారు. కాబట్టి […]
సాగినంత కాలం తనఅంతటి వాడు లేడందురు… సాగపోతే చతికిలపడిపోయి సాకులు వెతికేరు!. ఇప్పుడు టీటీడీపీ పరిస్థితి ఇలాగే ఉంది. తెలంగాణలో టీడీపీకి వరుస కష్టాలకు కారణం ”టీటీడీపీ” అన్న పదమేనట. తెలంగాణ టీడీపీ, టీటీడీపీ అని సంబోధిస్తే కష్టాలు తప్పవని కొందరు పండితులు సూచించారని చెబుతున్నారు.
టీడీపీ ముందు తెలంగాణ పదం చేర్చడం మంచిది కాదని సూచించారట. గతంలో ఇలాగే టీడీపీ పేరుకు ముందు పదాలను చేర్చడం వల్లే అన్నతెలుగుదేశం, ఎన్టీఆర్‌టీడీపీలు పతనమయ్యాయని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇకపై తెలంగాణ టీడీపీ కాకుండా తెలుదేశం తెలంగాణ పార్టీ అని పిలిస్తే బాగుంటుందని పండితులు సూచించారు. ఏపీలో కూడా ఏపీటీడీపీ అని కాకుండా తెలుగుదేశంఏపీ పార్టీ అని పిలిస్తే మంచిదని సలహా ఇచ్చారట.
ఈ నేపథ్యంలో మీడియాలోనూ ఇకపై తెలంగాణ టీడీపీ అని కాకుండా తెలుగుదేశం తెలంగాణ పార్టీ అని వచ్చేలా టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమను కలిసిన మీడియా ప్రతినిధులతో ఇకపై టీటీడీపీ అని రాయవద్దని కోరుతున్నారట. తమ హోదాలను రాసేటప్పుడు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విజ్ఞప్తికి మీడియా ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుందో!. మరి ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ కూడా ధ్వంసమైపోవడానికి ఇదే సెంటిమెంట్ కారణమా?. ఎందుకంటే ఆ పార్టీని కూడా ఏపీసీసీ, టీపీసీసీ అని పిలుస్తున్నారు.
Click on Image to Read: