ఫిట్‌నెస్ వ్యాపారంలోకి రకుల్!
రకుల్ ప్రీత్ సింగ్…చాలా వేగంగా హీరోయిన్‌గా ఎదిగింది. చూస్తూ ఉండగానే తనతోపాటు వచ్చిన రెజీనా, రాశీఖన్నాలను వెనక్కుతోసి మంచి ఆఫర్లను కొట్టేసింది. ఏ గాడ్‌ఫాదర్ లేకుండానే ఈమె ఒక్కోమెట్టు జాగ్రత్తగా ఎక్కేస్తోంది. ఇదే చాకచక్యం, వేగం రకుల్ డబ్బు వెనకేసుకోవడంలోనూ చూపుతోంది. వ్యాపారాల్లో రాణిస్తున్న చాలామంది తన తోటి నటీమణుల్లాగే ఆమె కూడా ఓ నూతన ప్రయత్నంలో ఉంది. రకుల్ ఎఫ్ 45 జిమ్ ఫ్రాంఛైజ్ తీసుకునే ఉద్దేశంలో ఉంది. ఎఫ్ 45 అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన […]
రకుల్ ప్రీత్ సింగ్…చాలా వేగంగా హీరోయిన్‌గా ఎదిగింది. చూస్తూ ఉండగానే తనతోపాటు వచ్చిన రెజీనా, రాశీఖన్నాలను వెనక్కుతోసి మంచి ఆఫర్లను కొట్టేసింది. ఏ గాడ్‌ఫాదర్ లేకుండానే ఈమె ఒక్కోమెట్టు జాగ్రత్తగా ఎక్కేస్తోంది. ఇదే చాకచక్యం, వేగం రకుల్ డబ్బు వెనకేసుకోవడంలోనూ చూపుతోంది. వ్యాపారాల్లో రాణిస్తున్న చాలామంది తన తోటి నటీమణుల్లాగే ఆమె కూడా ఓ నూతన ప్రయత్నంలో ఉంది. రకుల్ ఎఫ్ 45 జిమ్ ఫ్రాంఛైజ్ తీసుకునే ఉద్దేశంలో ఉంది. ఎఫ్ 45 అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఫిట్‌నెస్ సెంటర్. హాంకాంగ్, న్యూజిల్యాండ్, కెనడా, అమెరికాల్లో జిమ్ సెంటర్లు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇటీవలే ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరించింది. రకుల్ ఈ మధ్యనే నగరంలో ఒక అధునాతనమైన, ఖరీదైన అపార్ట్‌మెంట్‌ని తీసుకుంది. ఇందులో ఈ నెల 20న ఆమె జిమ్‌ని ప్రారంభించబోతోంది. రకుల్ సోదరుడు అమన్ ఈ బిజినెస్‌లో ఆమెకు అండగా నిలబడుతున్నాడు. నాన్నకు ప్రేమతో విజయంతో మరింతగా దూసుకుపోతున్న రకుల్, ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సరైనోడులో నటిస్తోంది. తనీ ఒరువన్ రీమేక్‌లో రామ్ చరణ్‌తో నటించనుంది.