మళ్ళీ ఒకే రోజు నాలుగు సినిమాలు పోటీకి సై
గత కొన్ని సంవత్సరాలుగా ఒకే రోజు ఎక్కువ చిత్రాలు రిలీజ్ చేయడం అనేది ఆగిపోయింది. నిర్మాతలు ముందుగానే చర్చించుకుని.. ఒక వరస ప్రకారం ఎవరికి నష్టం రాకూడదు అనే ఆలోచన తో డేట్స్ క్లాష్ అవ్వకుండ తమ చిత్రాల్ని రిలీజ్ చేసుకునే వారు. కానీ ఈ యేడాది సంక్రాంతి పండుగకు నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో బాలయ్య, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి కమర్షియల్ స్టార్ హీరోలతో పాటు.. శర్వానంద్ కూడా ఉన్నాడు. అయితే కథలు […]
గత కొన్ని సంవత్సరాలుగా ఒకే రోజు ఎక్కువ చిత్రాలు రిలీజ్ చేయడం అనేది ఆగిపోయింది. నిర్మాతలు ముందుగానే చర్చించుకుని.. ఒక వరస ప్రకారం ఎవరికి నష్టం రాకూడదు అనే ఆలోచన తో డేట్స్ క్లాష్ అవ్వకుండ తమ చిత్రాల్ని రిలీజ్ చేసుకునే వారు. కానీ ఈ యేడాది సంక్రాంతి పండుగకు నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో బాలయ్య, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి కమర్షియల్ స్టార్ హీరోలతో పాటు.. శర్వానంద్ కూడా ఉన్నాడు. అయితే కథలు బావుంటే.. స్టార్ డమ్ లతో సంబంధం లేకుండా కలెక్షన్స్ వసూలు చేస్తాయని శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం నిరూపించింది. ఇక సొగ్గాడే చిన్నినాయనా చిత్రం అయితే దుమ్ము లేపేసింది. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం కూడా బాగానే వసూలు చేసింది.బాలయ్య డిక్టేటర్ వెనుక పడ్డా టోటల్ గా సంక్రాంతి కి రిలీజ్ అయిన 4 చిత్రాలు దాదాపు 250 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ తేల్చారు.
ఇక తాజాగా మార్చి 4వ తేదిన మరోసారి ఒకే రోజు నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో మంచు మనోజ్ నటించిన శౌర్య చిత్రం తో పాటు.. నాగశౌర్య నటించిన కళ్యాణ వైభోగమే.. అలాగే శ్రీకాంత్ నటించిన టెర్రర్ చిత్రంతో పాటు.. ఒక తమిళ డబ్బింగ్ సినిమా శివగంగ పేరు తో రిలీజ్ అవుతుంది. మరి ఒకే రోజు నాలుగు సినిమాలంటే ముఖ్యంగా థియేటర్స్ సమస్య వుంటుంది. సినిమా బావుంటే..చిన్ని చిత్రమైన మంచి విజయం అందుకుంటుంది. ఏది ఏమైనా సంక్రాంతి చిత్రాల కలెక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఒకే రోజు 4 చిత్రాలు రావడం అనేది కొంత వరకు నిర్మాతలకు రిస్కే అని చెప్పాలి అంటున్నారు పరిశీలకులు. పండగ రోజులు వేరు. నార్మల్ డేస్ వేరు కదా.. స్టార్స్ చిత్రాలు వేరు. నాన్ స్టార్స్ చిత్రాలు వేరు. ఇవన్ని అవగాహాన వున్న వారు మాత్రం తమ చిత్రాల్ని సేఫ్ జోన్ లో రిలీజ్ చేసుకుంటారన్నడంలో డౌటే లేదు .