అల్లం టీ...అద్భుత ఔషధం!
అల్లంలో కఫ, వాత గుణాలను సమన్వయ పరచే లక్షణం ఉంది. ఉదయాన్నే అల్లంటీని సేవించడం వలన ఈ గుణాల కారణంగా తలెత్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇంకా అల్లం టీతో కలిగే ప్రయోజనాల గురించి- జీర్ణక్రియ మందకొడిగా ఉన్నవారికి అల్లంటీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న వేడి గుణం అరుగుదల శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైముల ఉత్పత్తిని అల్లంటీ పెంచుతుంది. జలుబు, దగ్గు సమస్యలకు సత్వర ఉపశమనం కలిగిస్తుంది. అల్లంటీని ప్రతిరోజూ తీసుకుంటే మలబద్దకం ఉండదు. […]
BY sarvi16 Feb 2016 8:58 AM IST
X
sarvi Updated On: 16 Feb 2016 9:08 AM IST
అల్లంలో కఫ, వాత గుణాలను సమన్వయ పరచే లక్షణం ఉంది. ఉదయాన్నే అల్లంటీని సేవించడం వలన ఈ గుణాల కారణంగా తలెత్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇంకా అల్లం టీతో కలిగే ప్రయోజనాల గురించి-
- జీర్ణక్రియ మందకొడిగా ఉన్నవారికి అల్లంటీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న వేడి గుణం అరుగుదల శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైముల ఉత్పత్తిని అల్లంటీ పెంచుతుంది.
- జలుబు, దగ్గు సమస్యలకు సత్వర ఉపశమనం కలిగిస్తుంది.
- అల్లంటీని ప్రతిరోజూ తీసుకుంటే మలబద్దకం ఉండదు. జీర్ణవ్యవస్థనుండి జీర్ణకాని ఆహారాన్ని,విషవాయువులను బయటకు పంపే శక్తి అల్లంటీకి ఉంది.
- పండుగ సమయాల్లో హెవీ ఫుడ్ తీసుకున్నపుడు ఇబ్బందిగా అనిపిస్తే అల్లంటీని తాగితే మంచిది. ఉపశమనంగా ఉంటుంది. అయితే సమస్య మరీ తీవ్రమైతే మాత్రం మందులను ఆశ్రయించాల్సిందే.
- చలికాలంలో అయితే ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది. బాడీ టెంపరేచర్‌ని పెంచుతుంది.
- రక్తప్రసరణను చక్కబరుస్తుంది. కదలకుండా కూర్చునే ఉద్యోగాల్లో ఉన్నవారు, శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారిలో రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇలాంటివారికి అల్లంటీ మంచి ఉపయోగకారి.
- శరీరంలో ఉండిపోయిన విషాలను బయటకు వెళ్లగొడుతుంది.
- కఫ లక్షణాలు ఉన్నవారికి ఇది చాలా చక్కని మందు.
- అల్లం టీ శరీరంలో కణ నిర్మాణానికి తోడ్పడుతుంది.
Next Story