అన్నా నీవు మళ్లీ రావాలి!- లగడపాటి బ్యాచ్ బ్యాండ్ బాజా
రాజకీయం కూడా ఒక డ్రగ్ లాంటిదే. దానికి ఒక్కసారి అలవాటు పడ్డాక మానుకోవడం అన్నది అంత ఈజీ కాదు. ఇప్పుడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా అలాంటి పరిస్థితే ఎదుక్కొంటున్నట్టుగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయరంగ ప్రవేశానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాదాపు రెండేళ్ల పాటు రాజకీయ సన్యాసిగా జీవించిన ఆయన ఇక ఆ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టే యోచనలో ఉన్నారు. ఇందుకు ఇటీవల […]
రాజకీయం కూడా ఒక డ్రగ్ లాంటిదే. దానికి ఒక్కసారి అలవాటు పడ్డాక మానుకోవడం అన్నది అంత ఈజీ కాదు. ఇప్పుడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా అలాంటి పరిస్థితే ఎదుక్కొంటున్నట్టుగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయరంగ ప్రవేశానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దాదాపు రెండేళ్ల పాటు రాజకీయ సన్యాసిగా జీవించిన ఆయన ఇక ఆ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టే యోచనలో ఉన్నారు. ఇందుకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన లగడపాటి పార్టీలో చేరేందుకు ఆసక్తికనబరిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం కేటాయించాలని లగడపాటి కోరడంతో ముఖ్యమంత్రి స్పందించలేకపోయారు. తాజాగా లగడపాటి అనుచరులు రంగంలోకి దిగారు.
లగడపాటి బ్రాండ్ పెంచేందుకు బెజవాడలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. లగడపాటి రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై బీజేపీ మద్దతుదారులు, పవన్ కల్యాణ్ బొమ్మలు కూడా ఉండడంపై విశేషం. అనుచరులు, కార్యకర్తల ఒత్తిడి మేరకే తిరిగి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకోవడంలో భాగంగా ఈ ఫ్లెక్సీలను వ్యూహాత్యకంగా ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే లగడపాటి ఏ పార్టీలోకి వెళ్తారన్న దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు.
ఇటీవల ఢిల్లీలో చంద్రబాబును కలిసినా ఆయన నుంచి విజయవాడ ఎంపీ స్థానంపై స్పష్టత రాలేదని సమాచారం. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా టీడీపీకే చెందిన కేశినేనినాని ఉండడంతో రాబోయే ఎన్నికలకు సంబంధించి లగడపాటికి ఇప్పుడే హామీ ఇస్తే మొదటికే మోసమొస్తుందన్న భావనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. లగడపాటికి హామీ ఇచ్చినట్టు తెలిస్తే కేశినేని నుంచి అనవసర ఇబ్బందులు తప్పవన్న భావనతోనే చంద్రబాబు నోరు మెదపలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి బీజేపీ వైపు కూడా చూస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీలో చేరితో దివాలా అంచున వున్న తనను ఆదుకుంటారని, బ్యాంకులకు బకాయి వున్న వేల కోట్లరూపాయలను వెంటనే చెల్లించాల్సిన అవసరం తప్పుతుందని, వ్యాపార పరంగానూ ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారట.
Click on Image to Read: