అనుష్క ఆ విషయంలో తానే టాప్ అట
ఇంట్లో అందరు వైద్యులు. సినిమాలు చూడటమే కానీ.. సినిమాలో యాక్ట్ చేయాలని గానీ.. సినిమా ను కెరీర్ గా తీసుకోవాలనే ఆలోచనలు ఆ ఫ్యామిలిలో ఎవరికి లేదు. కానీ .. అనుష్క మాత్రం తనకు తెలియకుండానే ఈ రెండు చేసేసింది. అందరు మెడిసిన్ చదవుతుంటే.. అనుష్క మాత్రం యోగా నేర్చుకుంది. కెమెరా ముందుకు వచ్చే నాటికి నటనలో ఏబిసిడిలు కూడా తెలియవు. అయితే మేకప్ వేసుకోవడం ప్రారంభించిన మొదటి రోజు నుంచి ..సినిమాల మీద ప్రేమ పెంచుకుంది. […]
ఇంట్లో అందరు వైద్యులు. సినిమాలు చూడటమే కానీ.. సినిమాలో యాక్ట్ చేయాలని గానీ.. సినిమా ను కెరీర్ గా తీసుకోవాలనే ఆలోచనలు ఆ ఫ్యామిలిలో ఎవరికి లేదు. కానీ .. అనుష్క మాత్రం తనకు తెలియకుండానే ఈ రెండు చేసేసింది. అందరు మెడిసిన్ చదవుతుంటే.. అనుష్క మాత్రం యోగా నేర్చుకుంది. కెమెరా ముందుకు వచ్చే నాటికి నటనలో ఏబిసిడిలు కూడా తెలియవు. అయితే మేకప్ వేసుకోవడం ప్రారంభించిన మొదటి రోజు నుంచి ..సినిమాల మీద ప్రేమ పెంచుకుంది. కెరీర్ లో నటిగా ఎన్నో ఎక్స్ పెరిమెంట్స్ చేసింది. అరుంధతి, బాహుబలి, వర్ణ, రుద్రమదేవి, సైజ్ జీరో వంటి చిత్రాలు చేసి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది.
ఇలా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి తనను నడిపించిన ఒకే ఒక ఎలిమెంట్.. ధైర్యమట. సినిమాల్లో చూపించనంత కాదు కానీ.. వేరే అమ్మాయిలతో పోల్చినప్పుడు అనుష్క తనకు కాస్తా ధైర్యం ఎక్కువనే అంటోంది. అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలోను అనుష్క ముందుంటుందట. దాంతో పాటు..ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత.. దానికి కట్టు బడి వుండటం తన స్ట్రాంగ్ పాయింట్స్ లో ఒకటని చెప్పుకుంది. ప్రస్తుతానికి బాహుబలి సీక్వెల్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న ఈ ముద్దుగుమ్మ..మరో చారిత్రిక నేపథ్యం కలిగిన సినిమాలో లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని టాక్.