వంశీకి అసలు మ్యాటర్ అర్థమైందా?
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతల మీదే కేసులు పెడుతోందన్న భ్రమ ఉండేది. కానీ అది అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది. ప్రజాపక్షాన నిలిస్తే అధికార పక్షమైనా సరే బొక్కలో వేసేందుకు రెడీ అంటూ సమన్యాయసిద్ధాంతాన్ని అమలు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అయితే అధికారులను తిట్టినా, అందులోనూ మహిళా అధికారులను కొట్టినా కేసులు మాత్రం పెట్టరు. కానీ ప్రజాసమస్యలంటూ రోడ్డెక్కితే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతోంది ఏపీలో. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు […]
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతల మీదే కేసులు పెడుతోందన్న భ్రమ ఉండేది. కానీ అది అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది. ప్రజాపక్షాన నిలిస్తే అధికార పక్షమైనా సరే బొక్కలో వేసేందుకు రెడీ అంటూ సమన్యాయసిద్ధాంతాన్ని అమలు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అయితే అధికారులను తిట్టినా, అందులోనూ మహిళా అధికారులను కొట్టినా కేసులు మాత్రం పెట్టరు. కానీ ప్రజాసమస్యలంటూ రోడ్డెక్కితే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతోంది ఏపీలో.
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదుతో ఆ విషయం మరోసారి రుజువైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రామవరప్పాడులో నేషనల్ హైవే వెంబడి ఇళ్లను కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ అక్కడికి వెళ్లి వారితో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. స్థానికుల ఆవేదనలో అర్థముందని భావించిన వంశీ వారికి మద్దతు ప్రకటించారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు వెనక్కు వెళ్లాలని అప్పటి వరకు స్థానికులు ఆందోళన విరమించే పరిస్థితి లేదని ఎమ్మెల్యే పోలీసులతో చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. అక్కడి వరకు బాగానే ఉంది.
కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన వంశీ అధికారుల పనులకు ఆటంకం కలిగించారంటూ కేసులు నమోదుచేశారు. దీంతో వంశీ ఒకింత షాక్ అయ్యారు . స్థానికులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు వస్తే తనపైనే కేసులు పెడుతారా అని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. అయితే వంశీపై కేసు నమోదుపై ఆయన అనుచరులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకే చెందిన కొందరు పెద్దలు కావాలనే వంశీపై కేసులు పెట్టించారని మండిపడుతున్నారు. తొలి నుంచి కూడా కొందరు జిల్లా టీడీపీ పెద్దలకు వంశీకి మధ్య ఉన్న విభేదాలను గుర్తు చేస్తున్నారు. పైగా వల్లభనేని వంశీ… హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లకు సన్నిహితుడిగా పేరుంది. కేసు నమోదు వెనుక మంత్రి దేవినేని ఉమ హస్తముందని కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే వీరి మధ్య చాలా కాలంగా తీవ్ర విభేదాలున్నాయి. ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ ఏకంగా మహిళ తహసీల్దార్ వనజాక్షిని ఇసుక రేవులో పడేసి కొట్టినా కేసులు పెట్టని పోలీసులు ప్రజల పక్షాన నిలిచిన వంశీపై మాత్రం కేసులు నమోదు చేశారంటే దీని వెనుక కొన్ని శక్తులు హస్తముందని ఆరోపిస్తున్నారు. వంశీ కూడా తాను ప్రజలతో మాట్లాడేందుకు వస్తే కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు వంశీ తప్పు చేసినట్టు తేలితే శిక్ష తప్పదని హోంమంత్రి చినరాజప్ప హెచ్చరించారు.
Click on Image to Read: