ఉమ చెప్పింది వేరు, జరిగింది వేరు- ఇలాంటి కేసులు చాలా చూశా!
కృష్ణా జిల్లా రామవరప్పాడులో ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న బాధితులకు సంఘీభావం తెలిపిన తనపై కేసులు నమోదు చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన తనపైనే కేసులు నమోదు చేయడం బాధ కలిగించిదన్నారు. అందుకే గన్‌మెన్లను వెనక్కు పంపినట్టు చెప్పారు. ఒక టీవీ చానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన వల్లభనేని వంశీ గొడవకు ముందు రోజు కలెక్టర్‌కు పలుమార్లు ఫోన్ చేశానని చెప్పారు. నాలుగుసార్లు మేసేజ్ పెట్టినా కలెక్టర్ స్పందించలేదన్నారు. […]
కృష్ణా జిల్లా రామవరప్పాడులో ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న బాధితులకు సంఘీభావం తెలిపిన తనపై కేసులు నమోదు చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన తనపైనే కేసులు నమోదు చేయడం బాధ కలిగించిదన్నారు. అందుకే గన్‌మెన్లను వెనక్కు పంపినట్టు చెప్పారు.
ఒక టీవీ చానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన వల్లభనేని వంశీ గొడవకు ముందు రోజు కలెక్టర్‌కు పలుమార్లు ఫోన్ చేశానని చెప్పారు. నాలుగుసార్లు మేసేజ్ పెట్టినా కలెక్టర్ స్పందించలేదన్నారు. చివరకు మంత్రి దేవినేని ఉమకు ఫోన్ చేసి సమస్యను వివరించానని చెప్పారు. వెంటనే తిరిగి ఫోన్ చేసిన మంత్రి ఉమ… ”కలెక్టర్‌తో మాట్లాడాను, ఇళ్లు కూల్చేందుకు ఎవరూ రారు” అని చెప్పినట్టు వంశీ వెల్లడించారు. అయితే తెల్లవారే సరికి వంద మంది రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని భయానక వాతావరణాన్ని సృష్టించారని వంశీ అన్నారు.
నిద్రపోతున్న వారిని కట్టుబట్టలతో రోడ్డుపై నిలబెట్టారని అందుకే బాధితులకు అండగా సంఘీభావం తెలిపినట్టు వెల్లడించారు. మంత్రి ఒకటి చెబితే జరిగింది మాత్రం మరోలా ఉందన్నారు. ప్రభుత్వం అంటే కలెక్టర్ ఒక్కరే కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. తానేమీ కాల్ మనీ రాకెట్, ఇసుక దందా, లిక్కర్ మాఫియాలో లేనని కేసులకు భయపడేది లేదన్నారు. ఇంత కన్నా పెద్ద కేసులో గతంలో చూశానని వంశీ చెప్పారు. అక్రమ దందాలు చేస్తున్న వారు బాగానే ఉన్నారని ప్రజల పక్షాన పోరాడిన తనపై మాత్రం కేసులు నమోదు చేశారన్న భావనను వంశీ వ్యక్తం చేశారు.
ఇళ్లు కూల్చేందుకు ఎవరూ రారని మంత్రి ఉమా హామీ ఇచ్చిన తర్వాత కూడా రెవెన్యూ అధికారులు రంగ ప్రవేశం చేయడంపై వంశీ వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన కొందరు పెద్దలు తమ నేతకు వ్యతిరేకంగా డ్రామాలు ఆడుతున్నారా అని అనుమానిస్తున్నారు.
Click on Image to Read: